అన్వేషించండి

సల్మాన్, మురుగదాస్ సినిమా అప్‌డేట్, ‘కార్తీకదీపం 2’ టెలికాస్ట్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

తిరుపతిలో అభిమానుల ఫోన్లు లాగేసుకున్న హీరో విశ్వక్‌ సేన్‌ - షాకైన ఫ్యాన్స్‌
యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అతడి లేటెస్ట్‌ మూవీ గామి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 22 కోట్లకు పైగా వసూళ్లు చేసి లాభాల్లోకి వెళ్లింది. ఇంత భారీ విజయం సాధించిన నేపథ్యంలో గామి టీం బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ చాందిని చౌదరి, డైరెక్టర్‌తో పాటు ఇతరు మూవీ టీం సభ్యులు తిరుపతి వెళ్లారు. నేడు ఉదయం విఐపీ దర్శనం ద్వారా స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ చాందని చౌదరిని చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఆసక్తిచూపించారు. వారితో సెల్ఫీ, ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ అంతా ఎగబడ్డారు. ఈ క్రమంలో హీరో విశ్వక్‌ సేన్‌ ఫ్యాన్స్‌ సెల్‌ఫోన్లు లాక్కుని వారిని ఆటపట్టించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అప్పుడు తిట్టింది, ఇప్పుడు చూస్తానంటుంది - ‘యానిమల్’ మూవీ చూస్తానంటోన్న అమీర్ ఖాన్ భార్య
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాపై ఇంకా కాంట్రవర్సీలు ముగిసిపోలేదనే అనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు, సందీప్‌కు మధ్య పరోక్ష వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో తాను అసలు ‘యానిమల్’ సినిమా చూడలేదని కిరణ్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ తాజాగా తనకు ‘యానిమల్’ చూడాలని ఉందంటూ మరొక స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కిరణ్ రావు  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో పరోక్ష వాగ్వాదాలు ముగిసిన తర్వాత ఆమె ఇప్పుడు అలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పదేళ్లకు కుదిరింది - సల్మాన్‌తో మురుగదాస్ సినిమా!
'టైగర్ 3'తో 2023లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ థియేటర్లలో సందడి చేశారు. ఆ సినిమా తర్వాత ఎవరి దర్శకత్వంలో సల్మాన్ సినిమా చేస్తారు? అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతో ఆయన ఓ సినిమా చేయనున్నారు. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా ఈ రోజు సినిమా వివరాల్ని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అంబానీ అంకుల్ మీరూ మా మూవీ చూడాలి - అనంత్ ప్రి-వెడ్డింగ్ వేడుకలో ‘ఓం భీమ్ బుష్’ టీమ్ అల్లరి
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. 'బ్రోచేవారెవరూ' తర్వాత వీరు ముగ్గురూ కలిసి నవ్వించబోతున్న చిత్రమిది. 'నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్' అనేది ట్యాగ్ లైన్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

గుడ్‌న్యూస్‌.. వంటలక్క వచ్చేస్తోంది! - ఆ రోజు నుంచే 'కార్తీక దీపం 2' సీరియల్‌ టెలికాస్ట్
మళ్లీ బుల్లితెరపై త్వరలో వంటలక్క సందడి కనిపించబోతుంది. సూపర్‌ హిట్‌ సీరియల్‌ 'కార్తీక దీపం' మళ్లీ వస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక దీపం 2 పేరుతో సీక్వెల్‌ను ప్రకటించారు. దీంతో బుల్లితెర ఆడియన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తూ టీవీకి ఎప్పుడెప్పుడు అతుక్కుపోదామా? అని బుల్లితెర ఆడియన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. వారందరిని ఫుల్‌ ఖుష్‌ చేసే ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 'కార్తీక దీపం' ప్రసారంకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget