Kiran Rao: అప్పుడు తిట్టింది, ఇప్పుడు చూస్తానంటుంది - ‘యానిమల్’ మూవీ చూస్తనంటోన్న అమీర్ ఖాన్ భార్య
Kiran Rao about Animal: కొన్నిరోజుల క్రితం కిరణ్ రావు, సందీప్ రెడ్డి వంగా మధ్య కోల్డ్ వార్ జరిగింది. దానికి కారణం ‘యానిమల్’. ఇక ఇన్నాళ్ల తర్వాత తనకు యానిమల్ చూడాలని ఉందంటూ ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Kiran Rao about Sandeep Reddy Vanga's Animal: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాపై ఇంకా కాంట్రవర్సీలు ముగిసిపోలేదనే అనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు, సందీప్‌కు మధ్య పరోక్ష వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో తాను అసలు ‘యానిమల్’ సినిమా చూడలేదని కిరణ్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ తాజాగా తనకు ‘యానిమల్’ చూడాలని ఉందంటూ మరొక స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో పరోక్ష వాగ్వాదాలు ముగిసిన తర్వాత ఆమె ఇప్పుడు అలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
పరోక్షంగా కౌంటర్లు..
2023 డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలయ్యింది ‘యానిమల్’. ఈ సినిమా విడుదల అవ్వకముందు నుండే దీని నుంచి విడుదలయిన ప్రతీ అప్డేట్ ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక థియేటర్లలో విడుదలయిన తర్వాత దీనిపై వస్తున్న కాంట్రవర్సీలకు లిమిట్ లేకుండా పోయింది. అదే సమయంలో అనుకోకుండా కిరణ్ రావు కూడా తన వ్యాఖ్యల ద్వారా సందీప్ రెడ్డి వంగాను, ‘యానిమల్’ను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడింది. దానికి సందీప్ కూడా సైలెంట్‌గా వదిలేయకుండా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మధ్యలోకి అమీర్ ఖాన్ పేరు కూడా వచ్చింది. ఇది జరిగిన చాలారోజులు అవుతున్నా.. మరోసారి ‘యానిమల్’ పేరును బయటికి తీసుకొచ్చింది కిరణ్ రావు.
దానికి ఉదాహరణ యానిమల్..
ప్రస్తుతం తను డైరెక్ట్ చేసిన ‘లాపతా లేడీస్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కిరణ్ రావు. అదే సమయంలో తనకు ‘యానిమల్’ చూడాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. ‘‘లాపతా లేడీస్‌కు చాలా ప్రేమ దక్కింది. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. క్రిటిక్స్‌కు కూడా ఈ సినిమా చాలా నచ్చింది. ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చినా కూడా అది కచ్చితంగా క్రిటిక్స్‌కు నచ్చాలని లేదు. ఈరోజుల్లో ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్, భారీ వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాలను ఇష్టపడుతున్నారు. దానికి ఉదాహరణ యానిమల్. నేను ఆ సినిమా చూడడం చాలా అవసరం. అది చాలామంది ప్రేక్షకులను మెప్పించింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కూడా చాలా మంచి యాక్టర్. ప్రేక్షకులు యానిమల్‌ను ఇష్టపడ్డారు కాబట్టి నాకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది కిరణ్ రావు.
ఇద్దరి మధ్య కోల్డ్ వార్..
కొన్నిరోజుల క్రితం సినిమాల్లో మహిళలపై జరుగుతున్న హింస గురించి మాట్లాడింది కిరణ్ రావు. అదే సమయంలో తను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని ప్రేక్షకులు భావించారు. ఈ వ్యాఖ్యలు సందీప్ వరకు వెళ్లాయి. దీంతో తను కూడా ఘాటుగా స్పందించాడు. దానికి కిరణ్ రావు కూడా కౌంటర్ ఇచ్చింది. అసలు తను సందీప్ సినిమాలే చూడనప్పుడు వాటిపై కామెంట్ ఎలా చేస్తానని రివర్స్ అయ్యింది. అలా కొన్నిరోజుల పాటు కిరణ్ రావు, సందీప్ రెడ్డి వంగా మధ్య జరిగిన కోల్డ్ వార్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇంతలోనే తాను ‘యానిమల్’ చూస్తానంటూ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: అనంత్ అంబానీకి బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే - కళ్లు తిరుగుతాయ్ జాగ్రత్త!