Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ ఎంత - డబ్బులు కట్టినా ఎన్నాళ్లు ఆగాలి?
Mahindra Thar Roxx Demand: మహీంద్రా థార్ రాక్స్‌కు ప్రస్తుతం మనదేశంలో భారీ డిమాండ్ ఉంది. వేరియంట్‌ను బట్టి దీని వెయిటింగ్ పీరియడ్ సంవత్సరం వరకు ఉంటుంది.
Mahindra Thar Roxx Waiting Period: మహీంద్రా సంస్థ గత సంవత్సరం థార్ రాక్స్‌ని విడుదల చేసింది. ఇది అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీకి మంచి పేరు పొందింది. భారతీయ మార్కెట్లో థార్ రాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దీని కారణంగా థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. మీరు కొనాలనుకునే వేరియంట్‌ను బట్టి ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా మారుతూ ఉంటుంది. మీరు మహీంద్రా థార్ రాక్స్‌ని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే బుక్ చేసుకున్నాక డెలివరీ ఎప్పటికి వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మహీంద్రా థార్ రాక్స్... 4x2, 4x4 వేరియంట్ల కోసం విభిన్నమైన వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. డీజిల్ లేదా పెట్రోల్ మోడల్‌కు కూడా వెయిటింగ్ పీరియడ్ భిన్నంగా ఉంటుంది. వార్తల్లో వినిపిస్తున్న దాని ప్రకారం డీజిల్ ఆటోమేటిక్ 4x2 కోసం వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరంగా ఉంది. ఐవరీ ఇంటీరియర్‌తో కూడిన 4x4 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ త్వరగా డెలివరీ అవుతుంది. ఇది కాకుండా మోచా ఇంటీరియర్‌తో కూడిన డీజిల్ 4x4 ఆటోమేటిక్‌పై దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
మహీంద్రా థార్ రాక్స్ ఇంజిన్ ఎలా ఉంది?
మహీంద్రా థార్ రాక్స్ అనేది ఒక ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ. ఈ వాహనం పెట్రోల్ వేరియంట్ 2 వీల్ డ్రైవ్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌పై 162 హెచ్‌పీ పవర్, 330 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌పై 177 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎం టార్క్ జనరేట్ అవుతుంది.
మహీంద్రా థార్ రాక్స్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో 152 హెచ్‌పీ పవర్‌ని, 330 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీంతో పాటు డీజిల్ ఇంజన్ వేరియంట్లలో 4 వీల్ డ్రైవ్ ఎంపిక కూడా ఉంది.
మహీంద్రా థార్ రాక్స్ ధర ఎంత?
మహీంద్రా థార్ రాక్స్ ఏడు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారులో 26.03 సెంటీమీటర్ల ట్విన్ డిజిటల్ స్క్రీన్ ఉంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి మొదలై రూ. 22.49 లక్షల వరకు ఉంటుంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
‘THE’ SUV rocks the stage once again! Thar ROXX brings home ‘Car of the Year’ and ‘4x4 of the Year’ at Autocar Awards 2025.
— Mahindra Thar (@Mahindra_Thar) December 11, 2024
📷Mahindra leadership on stage, from left to right :
Velusamy Ramasamy, President, Automotive Technology & Product Development
Rajesh Jejurikar, Executive… pic.twitter.com/MRos6D5GYd