Om Bheem Bush: అంబానీ అంకుల్ మీరూ మా మూవీ చూడాలి - అనంత్ ప్రి-వెడ్డింగ్ వేడుకలో ‘ఓం భీమ్ బుష్’ టీమ్ అల్లరి
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా తెరకెక్కిన తాజా సినిమా 'ఓం భీమ్ బుష్'. 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Om Bheem Bush Pramotions: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. 'బ్రోచేవారెవరూ' తర్వాత వీరు ముగ్గురూ కలిసి నవ్వించబోతున్న చిత్రమిది. 'నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్' అనేది ట్యాగ్ లైన్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి.
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వీడియోతో ఫన్నీగా ప్రమోషన్
'ఓం భీమ్ బుష్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి ఓ ఫన్నీ వీడియోను విడుదల చేసింది. తాజాగా జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో 'ఓం భీమ్ బుష్' టీమ్ పాల్గొని సందడి చేసినట్లు ఈ వీడియో రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ ఫన్నీగా సాగిన ఈ వీడియో చూసి ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతున్నారు.
వీడియో ప్రారంభం కాగానే, ముఖేష్ అంబానీ సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రపంచ ప్రముఖులు స్టేజి ముందు కూర్చొని ఉంటారు. 'ఓం భీమ్ బుష్' నటులు స్టేజి మీద నుంచి వాళ్లందరికీ అభివాదం చేస్తారు. తమను ఈ ఈవెంట్ కు ఆహ్వానించినందుకు అంబానీ అంకుల్‌కు శ్రీవిష్ణు థ్యాంక్స్ చెప్తాడు. ఇక తన జీవితం పూల పాన్పు కాదంటూ ప్రియదర్శి చెప్పడంతో శోభనం గదిలో పూల పాన్పును ఊహించుకుంటాడు శ్రీవిష్ణు. చాలా కష్టపడి 'ఓం భీమ్ బుష్' సినిమా చేశామంటాడు. మా సినిమా ఉందని ఏకంగా క్రికెట్ మ్యాచ్ అపినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాడు. అంబానీ ఫ్యామిలీ కోసం 'ఓం భీమ్ బుష్' హీరోలు ఓ స్పెషల్ సాంగ్ పాడుతారు. “తప్పక తప్పై చెప్పాక తప్పు ఒప్పు లేదే” అంటూ ఈ పాట సాగుతుంది. వీళ్ల మాటలు, పర్ఫార్మెన్స్ విని ముఖేష్ మనసులో ఏం అనుకుంటాడో ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఓం భీమ్ బుష్'
'ఓం భీమ్ బుష్' చిత్రాన్ని మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సన్నీ ఎంఆర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. 'సామజవరగమన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు నుంచి రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Read Also: రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల - అయ్యో పాపం, ఎంత కష్టమొచ్చింది