అన్వేషించండి

Ananya Nagalla: రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల - అయ్యో పాపం, ఎంత కష్టమొచ్చింది

అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘తంత్ర’. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Ananya Nagalla ‘Tantra’ Movie Promotions: అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల హీరోయిన్ తెరకెక్కిన లేలెస్ట్ మూవీ ‘తంత్ర’. ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హార‌ర్‌ ఎలిమెంట్స్‌ తో ఈ సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు థ్రిల్ కలిగించబోతోంది. ఇందులో చాలా సీన్స్ భయపెట్టేలా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి చిన్న పిల్ల‌లు రాకూడదని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ‘తంత్ర’ సినిమాలో అనన్య పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలు ప్రయోగించబడిన బాధితురాలిగా కనిపించబోతోంది. ప‌ల్లెటూర్లలో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయి? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్.

రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల

‘తంత్ర’ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిద్రబృందం మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా కొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగానే అనన్యతో కలిసి ఓ కొత్త ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో అనన్య ఐస్ క్రీమ్ బండి మాదిరిగానే రక్తం బండి నడుపుతూ కనిపించింది. తాగండి తాజా తాజా ‘తంత్ర’ రక్తం అంటూ బోర్డు కూడా పెట్టుకుంది. “రక్తం, రక్తం, తాజా ‘తంత్ర’ రక్తం, టెన్ రుపీస్, ట్వంటీ రుపీస్” అంటూ వీధిలో కేకలు వేస్తూ వెళ్తుంది. అంతేకాదు, అక్కడున్న యువకుడిని తన బండి దగ్గరికి తీసుకొచ్చి, బలవంతంగా రక్తం తాగిస్తుంది. కచ్చింతగా థియేటర్లలో ‘తంత్ర’ సినిమా చూడాలని చెప్తుంది. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేందుకు చిత్రబృందం చేస్తున్న సరికొత్త ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. కొందరు మాత్రం.. ‘‘అయ్యో పాపం అనన్యకు ఎంత కష్టం వచ్చింది, సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేయాల్సి వస్తోంది’’ అని అంటున్నారు. అనన్య ఇప్పటివరకు ఏ మూవీకి ఇలా శ్రమించలేదని, తనని చూస్తుంటే జాలేస్తోందని మరికొందరు అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TantraTheMovie (@tantrathemovie)

చాలా కాలం తర్వాత మళ్లీ కనిపించబోతున్న సలోని

ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య ‘తంత్ర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనన్యా నాగళ్ల ఈ జానర్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ మూవీలో సీనియర్ నటి సలోని ఓ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపిస్తోంది. ధ‌నుష్ ర‌ఘుముద్రి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. టెంప‌ర్ వంశీ, మీసాల ల‌క్ష్మ‌ణ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నరేష్ బాబు, రవి చైతన్య ‘తంత్ర’ సినిమాను నిర్మిస్తున్నారు.

గ్లామర్ పాత్రలకు రెడీ అంటున్న అనన్య

ఇక అచ్చతెలుగు అమ్మాయిలా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య నాగళ్ల .. ఇప్పుడు గ్లామర్ రోల్స్ సైతం చేయడానికి రెడీ అవుతోంది. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె, తొలి సినిమాలో సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటోంది.

Read Also: వాళ్లకు మహిళలను వేధించడం అలవాటే - ‘జల్సా’ రూమర్లకు చెక్ పెట్టిన నటి పూనమ్ కౌర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget