Karthika Deepam 2 Serial: గుడ్‌న్యూస్.. వంటలక్క వచ్చేస్తోంది! - ఆ రోజు నుంచే 'కార్తీక దీపం 2' సీరియల్ టెలికాస్ట్
Karthika Deepam 2 release date: బుల్లితెర ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్. కార్తీక దీపం 2 సీరియల్ ప్రసారంకు రెడీ అయ్యింది. ఈ సీరియల్ నెక్ట్స్ వీక్ నుంచి ప్రసారం కానుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది.
Karthika Deepam 2 seraial Updates: మళ్లీ బుల్లితెరపై త్వరలో వంటలక్క సందడి కనిపించబోతుంది. సూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం' మళ్లీ వస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక దీపం 2 పేరుతో సీక్వెల్‌ను ప్రకటించారు. దీంతో బుల్లితెర ఆడియన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ టీవీకి ఎప్పుడెప్పుడు అతుక్కుపోదామా? అని బుల్లితెర ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వారందరిని ఫుల్ ఖుష్ చేసే ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. 'కార్తీక దీపం' ప్రసారంకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
నెక్ట్స్ వీక్ నుంచే..
కార్తీక దీపం సీరియల్ నెక్ట్స్ వీక్ నుంచి టీవీలో ప్రసారం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం సీరియల్ మార్చి 18 నుంచి టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే మాత్రం ఇక బుల్లితెర ఆడియన్స్‌కి మాత్రం పండగే అని చెప్పాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అతి త్వరలోనే స్టార్ మా సీరియల్ టెలికాస్ట్ టైం, రిలీజ్ డేట్‌పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనుంది. కాగా కార్తీక దీపం సీరియల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ మహిళా ఆడియన్స్‌ని మాత్రమే కాదు అన్ని వర్గాల ఆడియన్స్‌ని మెప్పించింది. ముఖ్యంగా వంటలక్క పాత్రకు ఎంతో ఆదరణ దక్కింది.
ఐపీఎల్‌ని మించి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని, దేశంలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌తో ఈ సీరియల్ ఆశ్చర్యపరిచింది. చివరి వరకు అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో 'కార్తీక దీపం' టాప్‌లో కొనసాగింది. అయితే ఇందులో నటించిన నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ తమ ఒరిజినల్ పేర్లను కూడా మర్చిపోయి ప్రేక్షకుల మదిలో డాక్టర్‌బాబు, వంటలక్కలుగా స్థిరపడిపోయారంటే ఈ సీరియల్ సక్సెస్ రేషియో ఎంతుండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సీరియల్ అయిపోయి రెండేళ్లు అవుతున్నా కూడా ప్రేక్షకుల మనసులోంచి ఈ సీరియల్ చెరిగిపోలేదు. దీనికి రీసెంట్‌గా వచ్చిన ప్రోమోకి వచ్చిన రెస్పాన్సే ఉదాహరణ.
ఇటీవల రిలీజైన ప్రోమోలో శౌర్య పాపను తీసుకుని డాక్టర్ బాబు వాళ్ల ఇంటికి వస్తుంది దీప అలియాస్ వంటలక్క. అక్కడ ఒక వ్యక్తి తన కొడుకుని ఎత్తుకుని పని చేస్తుంటాడు. శౌర్య వాళ్లను గమనిస్తూ బాధతో దీపతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్లిన దీప, శౌర్యను చదువుకోమని చెప్పి పనులు చేస్తుంది. ఇంట్లో వాళ్లకు కావాల్సిన అన్నింటినీ వంటలక్క సమకూరుస్తుంది. అమ్మాయికి బెడ్ కాఫీ, పెద్దాయనకు ట్యాబ్లెట్స్, ఇలా ఎవరికి ఏం కావాలో అవి తీసుకెల్లి ఇస్తుంది వంటలక్క. అయితే హాల్‌లో దిగాలుగా కూర్చున్న శౌర్య దగ్గరకు డాక్టర్ బాబు వస్తాడు. ఏంటే రౌడీ ఇవాళ స్కూలు లేదా? ఇక్కడికి వచ్చావు అని అడగుతాడు.
దీంతో శౌర్య స్కూలు ఉంది కానీ తానే వెళ్లలేదని.. ఈరోజు స్కూల్లో ఫాదర్స్ డే.. పిల్లలు అందరూ వాళ్ల నాన్నలతో వెళ్తున్నారట.. మా నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు అంటూ శౌర్య పాప బాధపడుతుంది. అయితే గడ్డాలు, మీసాలు పెట్టుకొని నన్ను వచ్చేయమంటావా అంటూ డాక్టర్ బాబు అడగ్గానే శౌర్య పాప సంతోషపడిపోతుంది. ఇంతలో ఏమనుకోకండి బాబు గారూ అంటూ వంటలక్క అక్కడికి వస్తుంది. దీంతో దీపను కోపంగా చూసిన డాక్టర్ బాబు నీకు అర్థమవుతుందా.. ఆ పసి హృదయం తండ్రి ప్రేమ కోసం తపిస్తుంది.. పంతాలు, పట్టింపులకి పోకుండా ఒకసారి ఆలోచించు అంటూ డాక్టర్ బాబు సలహా ఇస్తాడు. అయితే బంధానికి, బాధ్యతలకి విలువ ఇవ్వని వ్యక్తి గురించి ఆలోచించను అంటూ అక్కడి నుంచి వంటలక్క వెళ్లిపోతుంది.