అన్వేషించండి

భోళా శంకర్ సాంగ్ ప్రోమో, రవితేజ కొత్త సినిమా ప్రకటన - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘భోళా శంకర్’ మూవీ నుంచి మరో సాంగ్ - ఫ్యాన్స్‌కు పండుగలాంటి పాట ఇది!
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. తమిళ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించనుంది. హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి సహా పలువురు నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘భోళాశంకర్’ నుంచి మరో సాంగ్‌ ప్రోమోను ఆదివారం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘‘జామ్ జామ్ జజ్జనక..’’ పూర్తి పాటను జులై 11, సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎన్టీఆర్ - అంతా విదేశాల్లోనే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) షెడ్యూల్ వచ్చే ఏడాది వరకు ఆల్మోస్ట్ బిజీ. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు ఆయన. దాని తర్వాత 'వార్ 2' షూట్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తారు. ఎన్టీఆర్ 31 సినిమాను పూర్తిగా విదేశాల్లో చిత్రీకరణ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే ఐదు నెలలు విదేశాల్లో ఆయన ఉంటారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

డేంజర్, ఆ ఊరంతా రేడియేషన్ - ఆసక్తికర పోస్టర్‌తో మరో మూవీని ప్రకటించిన రవితేజ, దర్శకుడు ఎవరో తెలుసా?
మాస్ మహారాజ్ రవితేజ మాంచి ఊపు మీద ఉన్నాడు. ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్ ప్రకటించకుంటూ వెళ్తున్నారు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీకి సిద్ధమయ్యాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కకున్నట్లు నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీపై శుక్రవారం ‘మాసియెస్ట్ అప్‌డేట్’ అంటూ హింట్ ఇచ్చారు. గోపీచంద్ మలినేనితో రవితేజకు ఇది నాలుగో సినిమా. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఏ స్థాయిలో హిట్ కొట్టాయో ప్రేక్షకులకు తెలిసిందే. ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ మూవీస్ మాస్ మహారాజ్ ఇమేజ్‌ను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రంలో రవితేజకు గోపిచంద్ ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడో చూడాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రామ్ చరణ్ మూవీలో తమిళ నటుడు విజయ్ సేతుపతి? RC16పై క్రేజీ బజ్!
హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో మరో మూవీ(RC16)కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ బజ్ చక్కెర్లు కొడుతోంది. బుచ్చిబాబు ఈ మూవీలో కూడా విజయ్ సేతుపతికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. సేతుపతి ‘ఉప్పెన’ మూవీలో నెగటివ్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అయితే, RC16లో ఏ పాత్రలో నటిస్తాడనేది ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

బిగ్ డాడీ వచ్చేది ఆ రోజే - ఇది శివన్న పాన్ ఇండియా 'ఘోస్ట్'
కరుణాడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఘోస్ట్'. ఇది పాన్ ఇండియా సినిమా. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 'కెజియఫ్', 'విక్రాంత్ రోణ', 'కాంతార' విజయాల తర్వాత కన్నడ సినిమాపై ఇతర భాషల ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పుడు శివ రాజ్ కుమార్ కొత్త సినిమా మీద తెలుగు ప్రేక్షకుల కన్ను పడింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'ఘోస్ట్' టీజర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget