Ghost Teaser - Big Daddy : బిగ్ డాడీ వచ్చేది ఆ రోజే - ఇది శివన్న పాన్ ఇండియా 'ఘోస్ట్'
Shiva Rajkumar's Ghost Movie : శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్'. ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల కానుంది.
కరుణాడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఘోస్ట్' (Ghost Pan India Movie). ఇది పాన్ ఇండియా సినిమా. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 'కెజియఫ్', 'విక్రాంత్ రోణ', 'కాంతార' విజయాల తర్వాత కన్నడ సినిమాపై ఇతర భాషల ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పుడు శివ రాజ్ కుమార్ కొత్త సినిమా మీద తెలుగు ప్రేక్షకుల కన్ను పడింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'ఘోస్ట్' టీజర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది.
జూలై 12న 'ఘోస్ట్' టీజర్ విడుదల!
Ghost Movie Teaser Release Date 2023 : ఈ నెల (జూలై) 12న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకుడు (birbal film director Srini). సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థలో ఇది 29వ సినిమా. 'బిగ్ డాడీ' పేరుతో టీజర్ విడుదల చేస్తున్నారు. జూలై 12న సినిమా విడుదల తేదీ వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
Also Read : 'సలార్' 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న సప్తగిరి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు
"When Violence Dies, Big Daddy Is Born” 🔥🔥💥💥
— BA Raju's Team (@baraju_SuperHit) July 9, 2023
Don't miss the grand debut on July 12th at 11:45am on the
T-Series YouTube channel. 🥁
Join the excitement and embrace #GHOST as we welcome the mighty BIGDADDY!"❤️🔥#KarunadaChakravarthy @NimmaShivanna @lordmgsrinivas… pic.twitter.com/H0f0eBAmFO
ఘోస్ట్... యాక్షన్ & థ్రిల్!
'ఘోస్ట్' సినిమాలో శివ రాజ్ కుమార్ క్యారెక్టర్, అందులో ఆయన నటన హైలైట్ అవుతాయని చిత్ర బృందం పేర్కొంది. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా కోట్ల రూపాయలతో సెట్స్ వేశామని తెలిపింది. ముఖ్యంగా జైలు సెట్, అందులో యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన చిత్రమిది.
ఆడియో @ ఆనంద్!
'ఘోస్ట్' ఆడియో & మ్యూజిక్ హక్కులను కన్నడనాట ప్రముఖ ఆడియో కంపెనీగా పేరు పొందిన ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేశారట. ఒక్క కన్నడ మాత్రమే కాదు... మిగతా భాషల ఆడియో హక్కులూ వారివే. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్ కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో పాటకు పొలిటికల్ డైలాగ్ టచ్
నట సింహం బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో శివ రాజ్ కుమార్ ఓ పాటలో కనిపించారు. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'కిల్లింగ్ వీరప్పన్'లో ప్రధాన పాత్ర చేశారు. ఆయన హీరోగా 'వేద' ఓటీటీలో అన్ని భాషల వీక్షకులను ఆకట్టుకుంది. త్వరలో బాలకృష్ణతో మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన అనౌన్స్ చేశారు.
ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే...
'వన్స్ ఎ గ్యాంగ్‌స్టర్... ఆల్వేస్ ఏ గ్యాంగ్‌స్టర్' - ఇదీ 'ఘోస్ట్' సినిమాకు ఇచ్చిన కొత్త కాప్షన్. 'ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే... ఎప్పుడూ గ్యాంగ్‌స్టరే' అని అర్థం అన్నమాట. 'ఘోస్ట్'లో శివ రాజ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ అని కన్ఫర్మ్ చేశారు. అన్నట్టు... సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్', ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమాల్లో కూడా శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఆ సినిమాల్లో ఆయనవి కీలకమైన పాత్రలు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial