అన్వేషించండి

Salaar Box Office Prediction : 'సలార్' 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న సప్తగిరి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు

బాక్సాఫీస్ బరిలో 'సలార్' సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని హీరో కమ్ కమెడియన్ సప్తగిరి ట్వీట్ చేశారు. సినిమాలో ఆయన ఓ రోల్ చేసినట్లు, డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు పేర్కొన్నారు.

భారతీయ బాక్సాఫీస్ బరిలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన చిత్రం ఏది? మన తెలుగు హీరో, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వచ్చిన 'బాహుబలి 2'. బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు ఆశించిన రీతిలో విజయాలు సాధించలేదు. అయితే, ఆ లోటు 'సలార్' తీర్చేలా ఉందని వీరాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకు కిక్ ఇచ్చే మాట చెప్పారు హీరో కమ్ కమెడియన్ సప్తగిరి. 

'సలార్'లో నటించిన సప్తగిరి
Sapthagiri In Salaar Movie : 'సలార్' సినిమాలో తాను నటించినట్లు సప్తగిరి ట్వీట్ చేశారు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశానని తెలిపారు. ఆ తర్వాత ''సలార్ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను'' అని సప్తగిరి పేర్కొన్నారు. ఆ మాటలు ప్రభాస్ అభిమానులకు సూపర్ డూపర్ కిక్ ఇస్తున్నాయి. సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన పాన్ వరల్డ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థకు ఆయన థాంక్స్ చెప్పారు.

Also Read : ఆంధ్రలో ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు - 'యాత్ర 2' దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్ ముఖం కనిపించలేదు...
కానీ, రెస్పాన్స్ మాత్రం సూపర్!
ఇటీవల 'సలార్' టీజర్ విడుదల చేశారు. అందులో ఒక్కటంటే ఒక్క ఫ్రేములో కూడా ప్రభాస్ కనిపించలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం అదిరింది. టీజర్ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకు వెళుతోంది. అయితే... ప్రభాస్ అభిమానులు ఇంకా ఎక్కువ ఆశించడంతో డిజప్పాయింట్ అయ్యారు. 

డార్లింగ్స్... ఆగస్టులో ట్రైలర్ విడుదల!
ప్రభాస్ అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. టీజర్ ద్వారా సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆగస్టులో ట్రైలర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Also Read : మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో పాటకు పొలిటికల్ డైలాగ్ టచ్

ఐదు భాషల్లో సెప్టెంబర్ 28న 'సలార్' 
'సలార్' సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం... మొత్తం ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు. అన్నట్టు... ప్రభాస్ 'రెబల్' సినిమా విడుదలైంది కూడా ఆ రోజే! హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కె.జి.యఫ్', 'కె.జి.యఫ్ 2'తో పాటు రిషబ్ శెట్టి 'కాంతారా' చిత్రాన్ని నిర్మించినది ఆయనే.

'సలార్'లో శృతి హాసన్ కథానాయిక. ఆద్య పాత్రలో ఆమె కనిపిస్తారు. ప్రభాస్, శృతి హాసన్ కలయికలో మొదటి చిత్రమిది. ఇందులో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు కనిపించనున్నారు. 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget