NTR 31 Update : ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎన్టీఆర్ - అంతా విదేశాల్లోనే?
ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'వార్ 2', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) షెడ్యూల్ వచ్చే ఏడాది వరకు ఆల్మోస్ట్ బిజీ. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు ఆయన. దాని తర్వాత 'వార్ 2' షూట్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా (NTR 31 Movie) చేస్తారు. ఆ సినిమా అప్డేట్ ఏమిటంటే?
విదేశాల్లో ఎన్టీఆర్ 31...ప్రీ ప్రొడక్షన్‌కు ఐదు నెలలు!
ఎన్టీఆర్ 31 సినిమాను పూర్తిగా విదేశాల్లో చిత్రీకరణ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్ (NTR 31 Pre Production Work) కోసమే ఐదు నెలలు విదేశాల్లో ఆయన ఉంటారట.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సలార్' (Salaar Part 1 – Ceasefire) చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఇది ఫస్ట్ పార్ట్ టీజర్. దాంతో 'సలార్' రెండు భాగాలుగా విడుదల కానుందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'సలార్' సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు విదేశాలు వెళతారని తెలిసింది. 'కెజియఫ్'లో యశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. ఇప్పుడు 'సలార్'లోనూ ప్రభాస్ రోల్ మాఫియా గ్యాంగ్‌స్టర్ తరహాలో ఉంటుంది. ఆ లెక్కన చూస్తే ఇంటెర్నేషల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎన్టీఆర్ కనిపించే అవకాశం ఉంది.
'దేవర' తర్వాత 'వార్ 2' షూటింగ్ షురూ!
'దేవర' చిత్రీకరణ పూర్తి చేశాక, ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ముందు 'వార్ 2' (War 2 Movie) షూటింగ్ కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 'వార్ 2', ప్రశాంత్ నీల్ సినిమాల మధ్య ఎన్టీఆర్ బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అదీ సంగతి!
Also Read : 'సలార్' 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న సప్తగిరి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు
'కెజియఫ్', 'కెజియఫ్ 2', ఇప్పుడీ 'సలార్'... ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. పైగా, ఆయన ఎన్టీఆర్ అభిమాని. దాంతో ఎన్టీఆర్ 31లో హీరోయిజం మరింత ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
'వార్ 2'లో యుద్ధభూమిలో...!
'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో ఎన్టీఆర్ నటించనున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ కియారా అడ్వాణీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని బీటౌన్ వర్గాల సమాచారం. మరి, హృతిక్ జోడిగా కియారా కనపడతారా? లేదంటే ఎన్టీఆర్ జంటగానా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగులో మహేష్ బాబుకు జోడీగా 'భరత్ అనే నేను', రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో ఆమె నటించారు. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' సినిమాలో కూడా నటిస్తున్నారు.
Also Read : మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో పాటకు పొలిటికల్ డైలాగ్ టచ్
ఆ స్పై ఫ్రాంచైజీలో షారుఖ్, సల్మాన్ కూడా!
'వార్ 2' స్పెషాలిటీ ఏమిటంటే... హిందీ చిత్రసీమలో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న స్పై ఫ్రాంచైజీలో సినిమా. 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' పేరుతో ఇండియన్ జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలు ఆ యూనివర్స్ (YRF SPY Universe)లోనివే. ఇప్పుడు 'వార్ 2' కూడా అందులో భాగమే. అందువల్ల, భవిష్యత్తులో షారుఖ్, సల్మాన్, హృతిక్, ఎన్టీఆర్ ఓ సినిమాలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial