News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘బ్రో’ మూవీ రివ్యూ, ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

'బ్రో' రివ్యూ : ఎనర్జీతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్ - మరి, సినిమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'. తమిళంలో సముద్రఖని తీసిన 'వినోదయ సీతం' దీనికి మూలం. తెలుగులో త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ - డార్లింగ్ FBలో ఏకంగా అలాంటి వీడియో?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా హ్యాకర్ల బారిన పడ్డారు. ప్రభాస్ అధికారిక ఫేస్బుక్ పేజ్ తాజాగా హాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేశారు. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో 'మనుషులు దురదృష్టవంతులు' అనే క్యాప్షన్ తో ఉన్న వీడియో ఉండడంతో ఈ వీడియోని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ప్రబాస్ ఏంటీ అలాంటి వీడియో పెట్టారని షాకయ్యారు. ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ట్వీట్టర్ ద్వారా అలర్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ సోషల్ మీడియా టీం సమస్యను పరిష్కరించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ధనుష్ మాస్ విధ్వంసం - 'కెప్టెన్ మిల్లర్' టీజర్, ఆ యాక్షన్ మామూలుగా లేవుగా
జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'కెప్టెన్ మిల్లర్'. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థలో టి.జి. త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా 'కెప్టెన్ మిల్లర్' తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్ ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. యుద్ధ భూమిలో గన్ పట్టుకుని నడుస్తున్న ఆయన లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ''ఫ్రీడమ్ అంటే రెస్పాక్ట్'' అని ఫస్ట్ లుక్‌కి ధనుష్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్ర కథ 1930 - 40ల నేపథ్యంలో సాగుతోందని నిర్మాతలు తెలిపారు. ధనుష్ కెరీర్‌లో భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘బేబీ’ రీమేక్ రైట్స్‌కు ఊహించని డిమాండ్ - మేకర్స్ ముందు భారీ ఆఫర్స్!
తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా దూసుకుపోతున్న 'బేబీ'... చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఊహించని కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.60కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఇతర పొరుగు భాషల నుంచి మేకర్స్ కు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. అయితే దీనిపై చిత్ర నిర్మాత SKN ఇంకా ఫైనల్ డిసీషన్ మాత్రం తీసుకోనట్టు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
కోలీవుడ్ ఫిలిం మేకర్స్ స్ట్రైట్ తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు వాటికి పొయేటిక్ టైటిల్స్ పెడుతూ ఉంటారు. కానీ అదే తమిళ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు మాత్రం వాటికి కొన్ని మాస్ టైటిల్స్ ని పెడుతుంటారు. అలా రీసెంట్ టైమ్స్ లో తమిళం నుంచి తెలుగులో రీమేక్ అయిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. సముద్ర ఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తమిళ ఒరిజినల్ వెర్షన్ కి 'వినోదయ సీతం' అనే టైటిల్ ని పెట్టిన సముద్రఖని ఇదే సినిమాని తెలుగులో 'బ్రో' అనే పేరుతో రీమేక్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Published at : 28 Jul 2023 05:06 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!