అన్వేషించండి

‘బేబీ’ రీమేక్ రైట్స్‌కు ఊహించని డిమాండ్ - మేకర్స్ ముందు భారీ ఆఫర్స్!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ' కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమాను రిమేక్ చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది.

Baby Remake Rights : తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా దూసుకుపోతున్న 'బేబీ'... చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఊహించని కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.60కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఇతర పొరుగు భాషల నుంచి మేకర్స్ కు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. అయితే దీనిపై చిత్ర నిర్మాత SKN ఇంకా ఫైనల్ డిసీషన్ మాత్రం తీసుకోనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో 'బేబీ' తమిళం, హిందీ భాషల రీమేక్ రైట్స్‌పై త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ చర్చలు జరుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. రీమేక్ కోసం హిందీ, తమిళ నిర్మాతలతో జతకట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, త్వరలో బేబీ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు, ప్రస్తుతానికైతే దీనిపై చర్చలు జరుగుతుండగా.. ఈ సినిమా రీమేక్ రైట్స్ ద్వారా రాబోయే రోజుల్లో 'బేబీ' మరిన్ని లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన 'బేబీ'.. ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం మౌత్ టాక్ తోనే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబడుతోన్న ఈ సినిమా.. ఇప్పటికే రూ.70కోట్ల మార్కును కూడా దేటేసి.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో 11 రోజుల్లోనే రూ.70కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అంతే కాదు విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్'డి సినిమా కలెక్షన్లను సైతం అధిగమించింది. ఇక సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపైనా మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

మెుదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'బేబీ'.. ఇప్పటికే అదే దూకుడును కొనసాగిస్తుండడంతో.. ఆగస్టు మెుదటి వారంలోనే ఓటీటీలోకి రావాల్సి ఉండడగా.. దాన్ని మేకర్స్ వాయిదా వేశారు. దీంతో ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మెుదటి వారంలో ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం.. ఈ స్థాయిలో వసూళ్లను రాబడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీకి యూత్‍లో మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య యాక్టింగ్‍ను అందరూ ప్రశంసిస్తున్నారు.

అలాగే 'బేబీ' సినిమాపై అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా 'బేబీ' చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్. తన ఇన్ స్టా స్టోరీలో బేబీ చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఇంత వైల్డ్ గా.. ఇంత క్రూరంగా ఉందేంటీ.. బోల్డ్ యాక్టర్స్ కాదు.. బోల్డ్ కంటెంట్ కూడా ఇంత మంచి విజయాన్ని అందుకున్న బేబీ టీంకి అభినందనలు" అని రాసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read AlsoOMG 2 Censor Cuts : అక్షయ్ కుమార్ సినిమాకు 20 కట్స్, 'A' సర్టిఫికెట్ - OMG 2 పెద్దలకు మాత్రమేనా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget