పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. నిజానికి ఈ సినిమాకి 'బ్రో' కంటే ముందు ఓ టైటిల్ని అనుకున్నట్లు దర్శకుడు సముద్ర ఖని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కోలీవుడ్ ఫిలిం మేకర్స్ స్ట్రైట్ తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు వాటికి పొయేటిక్ టైటిల్స్ పెడుతూ ఉంటారు. కానీ అదే తమిళ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు మాత్రం వాటికి కొన్ని మాస్ టైటిల్స్ ని పెడుతుంటారు. అలా రీసెంట్ టైమ్స్ లో తమిళం నుంచి తెలుగులో రీమేక్ అయిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. సముద్ర ఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తమిళ ఒరిజినల్ వెర్షన్ కి 'వినోదయ సీతం' (అంటే తమిళంలో వెర్రి మనస్సు అని అర్ధం) అనే టైటిల్ ని పెట్టిన సముద్రఖని ఇదే సినిమాని తెలుగులో 'బ్రో' అనే పేరుతో రీమేక్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్రఖని ఈ సినిమాకి 'బ్రో' అనే టైటిల్ పెట్టడం వెనుక కారణాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే టైటిల్ గురించి సముద్రఖని మాట్లాడుతూ.." బ్రో అనే టైటిల్ కథకు చాలా సముచితంగా ఉందని, వినడానికి కూడా పవర్ ఫుల్ గా ఉండడం , ఈ టైటిల్ కి యూత్ కి వెంటనే కనెక్ట్ అవుతుందని అంతేకాకుండా సినిమాలో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ ఒకరినొకరు 'బ్రో' అని పిలుచుకుంటారు. అందుకే సినిమాకి 'బ్రో' అనే టైటిల్ ని పెట్టామని చెప్పారు. అయితే ఈ సినిమాకి అసలు టైటిల్ ఇదేనా అని ప్రశ్నించగా.. సముద్రఖని సినిమాకి వర్కింగ్ టైటిల్ వేరే ఉందని వెల్లడించారు. ఈ రీమేక్ కి మూవీ టీమ్ మొదట ఓ టైటిల్ ని పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సినిమాకి మొదట 'కాల పురుషుడు' అనే టైటిల్ ని అనుకున్నారట. అయితే ఈ టైటిల్ వినడానికి పవర్ ఫుల్ గా, మాస్ గా ఉన్నా ఈ టైటిల్ సినిమా కంటెంట్ పై తప్పు అంచనాలకు దారితీస్తుందని సముద్రఖని , త్రివిక్రమ్ భావించారట. అందుకే ఈ టైటిల్ని మార్చాలని నిర్ణయించుకున్నారట. దీని తర్వాత కాలభైరవ, శివుడి పేర్లకు సంబంధించి మరికొన్ని టైటిల్స్ ని అనుకున్నా చివరగా 'బ్రో' టైటిల్ కే మొగ్గుచూపారని తెలుస్తోంది. చాలామంది నెటిజన్స్ 'కాల పురుషుడు' అనే టైటిల్ కూడా బాగానే ఉందని, ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సూట్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
బ్రో విషయానికి వస్తే.. జీ స్టూడియో సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో పవన్ కి జోడిగా ప్రియా ప్రకాష్ వారియర్, సాయి తేజ్ కి సరసన కేతిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. ఎస్, ఎస్ తమన్ సంగీతమందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. జులై 28 (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, ఆయన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న 'బ్రో' సినిమా బాక్సఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Readc : ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ - డార్లింగ్ FBలో ఏకంగా అలాంటి వీడియో?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial