అన్వేషించండి

Captain Miller Teaser : ధనుష్ మాస్ విధ్వంసం - 'కెప్టెన్ మిల్లర్' టీజర్, ఆ యాక్షన్ మామూలుగా లేవుగా

Dhanush Birthday : జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ నటిస్తున్న సినిమా 'కెప్టెన్ మిల్లర్'. ఈ రోజు హీరో పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు.

జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ (Dhanush) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'కెప్టెన్ మిల్లర్' (Captain Miller Movie). ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థలో టి.జి. త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు (Dhanush Birthday). ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. 

'కెప్టెన్ మిల్లర్' టీజర్ ఎలా ఉందంటే?
'కెప్టెన్ మిల్లర్' టీజర్ నిడివి 100 సెకన్స్ లోపు మాత్రమే! అయితేనేం... సినిమాలో ప్రధాన పాత్రలు అన్నిటినీ చూపించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కొందరు భారతీయులు చేసిన స్వాతంత్య్ర పోరాటమే చిత్రకథ అని అర్థం అవుతోంది. గొడ్డలితో ఒకరి మీద ధనుష్ చేసిన దాడి అయితే అరాచకం అంతే! తుపాకీతో తూటాలు విదిల్చిన తీరు కూడా అమోఘం. కథానాయిక ప్రియాంకా అరుళ్ మోహన్, సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ క్యారెక్టర్లు కూడా పరిచయం చేశారు. డిసెంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 

Also Read : ఏపీకి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - కాన్ఫిడెంట్‌గా తప్పులో కాలేసి ఊర్వశి ట్వీట్

హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్!
హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా 'కెప్టెన్ మిల్లర్' తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్ ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. యుద్ధ భూమిలో గన్ పట్టుకుని నడుస్తున్న ఆయన లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ''ఫ్రీడమ్ అంటే రెస్పాక్ట్'' అని ఫస్ట్ లుక్ (Captain Miller First Look)కి ధనుష్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్ర కథ 1930 - 40ల నేపథ్యంలో సాగుతోందని నిర్మాతలు తెలిపారు. ధనుష్ కెరీర్‌లో భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది.  

ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది థియేటర్లలోకి రానుందీ సినిమా. 

'కెప్టెన్ మిల్లర్' కోసం స్టైల్ మార్చిన ధనుష్
అవసరం అయితే, కథ డిమాండ్ చేస్తే... క్యారెక్టర్ కోసం లుక్స్, స్టయిల్స్ మార్చే హీరోల్లో ధనుష్ ఒకరు. ఇప్పుడీ 'కెప్టెన్ మిల్లర్' కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఫుల్లుగా గడ్డం, జుట్టు పెంచారు. దానికి తోడు పీరియాడిక్ నేపథ్యం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. 

శేఖర్ కమ్ముల సినిమా కూడా...
'కెప్టెన్ మిల్లర్' కాకుండా హిందీలో 'తేరే ఇష్క్ మే' సినిమా చేస్తున్నారు ధనుష్. ఇంకా సన్ పిక్చర్స్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నారు. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా ధనుష్ 51వ చిత్రమది. ఆ సినిమాను కూడా ధనుష్‌ బర్త్‌డే సందర్భంగా అనౌన్స్ చేశారు. అందులో నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కథానాయికగా రష్మిక పేరు పరిశీలనలో ఉంది. ఇదీ పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా రూపొందుతోంది.

Also Read నన్ను వదిలేయండి, ప్రభాస్ మీద కామెంట్ చేయలేదు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు

ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో యువ తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌ కుమార్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీశ్‌, జాన్ కొక్కెన్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, వినోద్ కిషన్, నాజర్, విజి చంద్రశేఖర్, బాల శరవణన్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : టి. రామలింగం, కూర్పు : నాగూరన్, ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ : సత్య జ్యోతి ఫిల్మ్స్, సమర్పణ : టీజీ త్యాగరాజన్, నిర్మాతలు : సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, రచన & దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget