మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ షో పెంచారు. రీసెంట్ ఫొటోస్ చూస్తే ఆ మాట మీరూ అంటారు. రజనీకాంత్ తో 'జైలర్'లో తమన్నా చేసిన 'నువ్ కావాలయ్యా' విపరీతంగా వైరల్ అయ్యింది. 'నువ్ కావాలయ్యా' హిందీ వెర్షన్ 'తు ఆ దిల్ బరా' సాంగ్ లాంచ్ ప్రోగ్రాంకి తమన్నా ఈ డ్రస్ లో వచ్చారు. ఇటీవల తమన్నా హిందీ వెబ్ సిరీస్ లు చేశారు. 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా'లో బోల్డ్ సీన్స్ చేశారు. లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ చేయకూడదనే పాలసీని తమన్నా పక్కన పెట్టేశారు. 'లస్ట్ స్టోరీస్ 2'లో విజయ్ వర్మతో తమన్నా లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారు. 'జైలర్' కాకుండా తెలుగులో చిరంజీవితో 'భోళా శంకర్' చేస్తున్నారు తమన్నా. తమన్నా (All Images Courtesy : tamannaahspeaks / Instagram)