హనుమాన్ రిలీజ్ డేట్, ‘మంగళవారం’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
2023 ఫస్టాప్ బాక్సాఫీస్ రిపోర్ట్: అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు ఇవే!
2023 ఫస్టాప్ లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద అనేక సినిమాలు సందడి చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిస్తే, మరికొన్ని చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపించాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంక్రాంతి బరిలో ‘హనుమాన్’, ఫ్రెష్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హను మాన్‌లా శక్తులు పొందిన సామాన్యుడు అంజనాద్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడనే నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజ్ అప్ డేట్ వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం’ మూవీ అప్డేట్ - టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్100’ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ మూవీ భారీ హిట్ అందుకోవడంతో ఓవర్నైట్ లోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది పాయల్. ఈ మూవీలో కొంచెం బోల్డ్ గా కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడు తనకు మంచి హిట్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో కూడా పాయల్ లుక్ చూస్తే ఈ సినిమాలో కూడా రొమాంటిక్ రోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ‘మంగళవారం’ మూవీ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాలీవుడ్ లో మరో విషాదం, యువ నటుడు గుండెపోటుతో కన్నుమూత
తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాద ఘటనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో చనిపోగా, రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి టీజీ గీతాంజలి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజాగా మరో యువ నటుడు కన్నుమూశాడు. అతడు నటించిన సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చనిపోవడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అనిల్ శర్మ ప్రొడక్షన్స్ పై అమీషా పటేల్ ఆగ్రహం, అసలు ఏం జరిగిందంటే?
నటి అమీషా పటేల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కొంతకాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. 2000లో హీరోయిన్ గా సినీ కెరీర్ మొదలు పెట్టింది. తెలుగుతో పాటు హిందీలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. అగ్రతారగా చలామణి అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతోంది. హిందీతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించి ‘గదర్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాణ సంస్థ తీరుపై అమీషా సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)