అన్వేషించండి

Mangalavaaram: పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం’ మూవీ అప్డేట్ - టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మంగళవారం’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకు సంబంధించిన టీజర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్.

Mangalavaaram: దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్100’ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ మూవీ భారీ హిట్ అందుకోవడంతో ఓవర్నైట్ లోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది పాయల్. ఈ మూవీలో కొంచెం బోల్డ్ గా కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడు తనకు మంచి హిట్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో కూడా పాయల్ లుక్ చూస్తే ఈ సినిమాలో కూడా రొమాంటిక్ రోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ‘మంగళవారం’ మూవీ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

మళ్లీ అదే బోల్డ్ పాత్రలో పాయల్?

పాయల్ రాజ్ పుత్ కు ‘ఆర్ఎక్స్100’ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో తన గ్లామర్ కు యూత్ ఫిదా అయింది. మళ్లీ ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న ‘మంగళవారం’ సినిమాలో కూడా పాయల్ బోల్డ్ గానే నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మూవీ ఫస్ట్ లుక్ లో కూడా పాయల్ హాట్ గానే కనిపించింది. దీంతో ఈ మూవీలో కూడా బోల్డ్ పాత్రలోనే కనిపిస్తుందని అంటున్నారు. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ మూవీకు సంబంధించిన టీజర్ ను జులై 4 న ఉదయం 10:30 గంటలకు విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

కళ్లల్లో భయం..

అజయ్ భూపతి సినిమా టేకింగ్ చాలా బాగుంటుంది. ఆయన గత సినిమాలు చూస్తే అది క్లియర్ గా తెలుస్తుంది. ‘ఆర్ఎక్స్100’ లో కూడా పాయల్ రాజ్ పుత్ లో నెగిటివ్ షేడ్ ను చాలా చక్కగా టేకింగ్ చేయగలిగారు. అందుకే ఆ సినిమాలో ఇందు పాత్రకు అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘మంగళవారం’ అనే సినిమాపై కూడా అలాంటి క్యూరియాసిటీను క్రియేట్ చేస్తున్నారు అజయ్ భూపతి. టీజర్ రిలీజ్ పోస్టర్ లో కూడా ‘కళ్లల్లో భయం’ అంటూ ఇంట్రస్టింగ్ గా రాసుకొచ్చారు. దీంతో ఈ మూవీపై ఉత్కంఠ నెలకొంది. ‘ఆర్ఎక్స్100’ లో పాయల్ రాజ్ పుత్ తో మ్యాజిక్ చేసిన అజయ్ ఈసారి ‘మంగళవారం’ సినిమాలో ఆమెను ఎలాంటి పాత్రలో చూపిస్తారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాయల్ ఫ్యాన్స్. 

‘ఆర్ఎక్స్100’, ‘మహా సముద్రం’ సినిమాల తర్వాత తన మూడో చిత్రంగా ఈ ‘మంగళవారం’ అనే సినిమాను చేస్తున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్ గా పూర్తి చేశారని సమాచారం. ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను స్వాతి గుణపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. కాంతార సినిమా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీ దర్శకుడు అజయ్ భూపతికి అలాగే పాయల్ రాజ్ పుత్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. 

Also Read: టాలీవుడ్‌లో సినీ జాతర - జులైలో అన్నీ భారీ చిత్రాలే, ఒకే రోజు మూడు క్రేజీ మూవీస్ రిలీజ్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

టాప్ హెడ్ లైన్స్

Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Medha Meka Mythri In Love : హీరోయిన్‌‌గా శ్రీకాంత్ కూతురు మేధ - క్యూట్ లవ్ స్టోరీతో డెబ్యూ
హీరోయిన్‌‌గా శ్రీకాంత్ కూతురు మేధ - క్యూట్ లవ్ స్టోరీతో డెబ్యూ
Nithiin New Movie : నితిన్ సరసన మీనాక్షి చౌదరి? - మరో మూవీకి యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్
నితిన్ సరసన మీనాక్షి చౌదరి? - మరో మూవీకి యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్
Godavari Serial Today October 12th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget