‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?
డిసెంబర్‌లో సినిమాల సందడి మామూలుగా లేదు.. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీల్లో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ మూవీ లవర్స్‌కు మంచి ఫీస్ట్ ఇవ్వనున్నాయి. ఈ శుక్రవారం ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ముందుకు రాగా.. మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రీసెంట్ హిట్ ‘మంగళవారం’ కూడా యాడ్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో మూవీ టీమ్ రివీల్ చేసింది. థియేటర్లలో పాన్ ఇండియా భాషల్లో విడుదలయిన ‘మంగళవారం’.. ఓటీటీలో కూడా అన్ని భాషల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘ఫైటర్’ టీజర్ - హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ రోషన్ మూవీ, తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్
‘విక్రమ్ వేద’ మూవీ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె, సీనియర్ నటుడు అనీల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రణబీర్ తండ్రిగా రణవీర్, ‘బ్రహ్మాస్త్ర 2’లో దేవ్ అతడేనట!
ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’కు కొనసాగింపుగా రానున్న ‘బ్రహ్మాస్త2’లో రణవీర్ సింగ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దేవ్ అనే పాత్ర కోసం రణ్‌వీర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. శివకి తండ్రిగా రణవీర్ కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు తను కూడా ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా 2025లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'విరూపాక్ష' తరహాలో 'తంత్ర' - డీ గ్లామర్ రోల్‌లో అనన్య!
హారర్, థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది వచ్చిన 'విరూపాక్ష' మంచి సక్సెస్ అందుకుంది. అటువంటి సినిమా మరొకటి వస్తుందని 'తంత్ర' చూస్తుంటే అర్ధం అవుతోంది. 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల (Ananya Nagalla). 'ప్లే బ్యాక్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆమె ఓ హారర్ థ్రిల్లర్ చేశారు. అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'తంత్ర' (Tantra Movie). దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అట్టహాసంగా ‘తండేల్’ మూవీ లాంఛ్, ఏడాదిన్నరగా కష్టపడుతున్నామన్న నాగ చైతన్య
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించి ‘కస్టడీ’ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆశలన్నీ తన తదుపరి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)