అన్వేషించండి

Ranveer singh: రణబీర్ తండ్రిగా రణవీర్, ‘బ్రహ్మాస్త్ర 2’లో దేవ్ అతడేనట!

Ranveer singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర పోషించబోతున్నారు. శివ తండ్రి దేవ్ పాత్రలో ఆయన కనిపించనున్నారు.

Ranveer singh In Brahmastra 2: ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్‌, ఆలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’కు కొనసాగింపుగా రానున్న ‘బ్రహ్మాస్త2’లో రణవీర్ సింగ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దేవ్‌ అనే పాత్ర కోసం రణ్‌వీర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. శివకి తండ్రిగా రణవీర్‌ కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు తను కూడా ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా 2025లో సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.   

‘బ్రహ్మాస్త్ర’కు మిశ్రమ స్పందన

ఇక ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలైంది. తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు కూడా రాలేదు. తెలుగులోనూ డీసెంట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కంటెంట్ చాలా పూర్ గా ఉందనే టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ మాత్రం ఫర్వాలేదు అనిపించాయి. ఈ సినిమాలో స్టార్ యాక్టర్లు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్,  అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ నటించారు. వీరి కారణంగా ఆమాత్రం వసూళ్లు అయినా వచ్చాయని చెప్పుకోవచ్చు. నాగార్జున నటించడం, రాజమౌళి సమర్ఫకుడిగా ఉండటంతో తెలుగులో బాగానే ఆడింది. వసూళ్ల పరంగానూ ఓకే అనిపించింది.   

స్క్రిప్ట్ వర్క్ లో  ‘బ్రహ్మస్త్ర పార్ట్ 2’

‘బ్రహ్మస్త్ర’ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని సినిమా క్లైమాక్స్ లో చూపించారు.  రీసెంట్ గా ఈ మూవీ సీక్వెల్ గురించి రణబీర్ కపూర్ కీలక విషయాన్ని వెల్లడించాడు. సినిమా ప్రారంభంలోనే ‘బ్రహ్మాస్త’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారని చెప్పారు. అయితే, తొలి భాగం విడుదలై ఏడాది గడుస్తున్న ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు రెండో భాగం ఉంటుందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో రణబీర్ ‘బ్రహ్మాస్త్ర 2’ గురించి క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు అయాన్ రెండు భాగానికి సంబంధించి తనకు కథ చెప్పినట్లు వెల్లడించారు. ‘బ్రహ్మాస్త్ర 2’ కి ఇంకా రైటింగ్ వర్క్ ఇంకా చాలా చేయాలన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వివరించారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉండబోతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ 'వార్‌ 2' సినిమా తో బిజీగా ఉన్నాడు. హృతిక్‌ రోషన్‌,  జూనియర్ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక రణవీర్ సింగ్ ఈ ఏడాది ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింగమ్‌ అగైన్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సంగ్రామ్‌ భలేరావ్‌గా కనిపించనున్నారు. అటు ఓ పాన్‌ ఇండియా మూవీలోనూ ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

Read Also: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Jagadhatri Serial Today October 8: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
జగద్ధాత్రి సీరియల్: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget