అన్వేషించండి

Tanushree Dutta: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్

Tanushree Dutta: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గురించి నటి తనుశ్రీ దత్తా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన కంఫర్టబుల్ కిస్సర్ కాదని వెల్లడించింది.

Tanushree Dutta About Emraan Hashmi Kissing Scene: బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఆషికి బనాయా ఆప్నే’ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘వీరభద్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలుకరించింది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయింది. ఈ సినిమాలో ఆమె నటన పట్ల ప్రశంసలు దక్కినా, తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత తను బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. #MeToo ఆరోపణల నేపథ్యంలో.. మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. చాలా కాలంగా తను వెండితెరకు దూరంగానే ఉంటుంది. తాజాగా ఆమె తనకు మంచి గుర్తింపు తెచ్చిన ‘ఆషికి బనాయా ఆప్నే’ సినిమా గురించి మాట్లాడింది. ఈ సినిమాలోని ముద్దు సన్నివేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.   

ఇమ్రాన్ కంఫర్టబుల్ కిస్సర్ కాదు- తనుశ్రీ

ఇమ్రాన్ తో కలిసి నటించిన ‘ఆషికి బనాయా ఆప్నే’ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని తనుశ్రీ వెల్లడించింది. అయితే, ఈ సినిమాలో ఇమ్రాన్ తో ముద్దు సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలైనట్లు వెల్లడించింది. “ఇమ్రాన్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించాను. ‘చాక్లెట్’ మూవీలోనూ మా మధ్య ముద్దు సీన్లు ఉన్నాయి. కానీ, ఎడిటింగ్ లో వాటిని తొలగించారు. తొలిసారి ముద్దు సీన్లు చేసే సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. రెండోసారి పెద్దగా కష్టం అనిపించలేదు. ఎందుకంటే మా మధ్యన కెమిస్ట్రీ లేదు. అప్పటికే ఇమ్రాన్ కు కిస్సింగ్ బాయ్ అనే ముద్ర పడింది. అయినప్పటికీ, నాకు ఆయనతో ముద్దు సీన్లో నటించడం కంఫర్టబుల్ గా అనిపించలేదు” అని తనుశ్రీ వెల్లడించింది. తనుశ్రీ దత్తా ఇమ్రాన్ హష్మీతో కలిసి మూడు సినిమాలు చేసింది. ‘ఆషికి బనాయా ఆప్నే’, 'చాక్లెట్: డీప్ డార్క్ సీక్రెట్స్', 'గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్' చిత్రాల్లో కలిసి నటించారు. ‘ఆషికి బనాయా ఆప్నే’ సినిమాలో ఇమ్రాన్, తనుశ్రీ మధ్య ముద్దు సన్నివేశాలు అప్పట్లో కుర్రకారును వెర్రెక్కించేలా చేశాయి.   

తనుశ్రీ దత్తా సినీ కెరీర్ గురించి..

తనుశ్రీ దత్తా 2005లో ‘ఆషికి బనాయా ఆప్నే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'రకీబ్: రివల్స్ ఇన్ లవ్', 'ధోల్', 'సాస్ బహు ఔర్ సెన్సెక్స్' సహా పలు సినిమాల్లో నటించింది. ఆమె చివరి సారిగా 'హమ్ నే లి హై షపత్' సినిమాలో కనిపించింది. 2013లో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత తను మీటూ ఆరోపణలు చేయడంతో అవకాశాలు తగ్గిపోయాయి.  

ఇమ్రాన్ ముద్దు సన్నివేశాలతో ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యాడు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలోనే వరుస సినిమాల్లో ముద్దు సీన్లు చేసి 'సీరియల్ కిస్సర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మర్డర్', 'జెహర్', 'గ్యాంగ్‌స్టర్' చిత్రాలతో బాగా పాపులర్ అయ్యాడు. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై', 'ది డర్టీ పిక్చర్',  'షాంఘై' వంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి నటుడిగా సత్తా చాటుకున్నాడు. ఇమ్రాన్ చివరిగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లో కనిపించాడు.

Read Also: గీతాంజలి ఓ శక్తి, ఓ శిల - ‘యానిమల్’ మూవీలో తన క్యారెక్టర్ గురించి రష్మిక కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget