అన్వేషించండి

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన రీసెంట్ సెన్సేషన్ హిట్ ‘మంగళవారం’ ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది.

Mangalavaaram Movie OTT Release: డిసెంబర్‌లో సినిమాల సందడి మామూలుగా లేదు.. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీల్లో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ మూవీ లవర్స్‌కు మంచి ఫీస్ట్ ఇవ్వనున్నాయి. ఈ శుక్రవారం ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ముందుకు రాగా.. మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రీసెంట్ హిట్ ‘మంగళవారం’ కూడా యాడ్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో మూవీ టీమ్ రివీల్ చేసింది. థియేటర్లలో పాన్ ఇండియా భాషల్లో విడుదలయిన ‘మంగళవారం’.. ఓటీటీలో కూడా అన్ని భాషల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

‘మంగళవారం’తో సూపర్ హిట్..
‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. కానీ తన రెండో సినిమా ‘మహాసముద్రం’తోనే భారీ డిసాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. దీంతో నటీనటులు తనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అందుకే తన ఫస్ట్ సినిమా హీరోయిన్‌తోనే ‘మంగళవారం’ అనే థ్రిల్లర్‌ను ప్లాన్ చేశాడు. అజయ్ భూపతి తెరకెక్కించిన ముందు సినిమాలకంటే ‘మంగళవారం’ చాలా డిఫరెంట్. ఇందులో థ్రిల్లర్, హారర్ లాంటి ఎలిమేంట్స్‌ను కూడా యాడ్ చేశాడు దర్శకుడు. దీంతో ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్‌ను అందుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఏ ప్లాట్‌ఫార్మ్ దక్కించుకుందో బయటపడింది.

ఆ ఓటీటీలోనే..
అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ ‘మంగళవారం’ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు సమాచారం. హిందీలో తప్పా మిగతా అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘మంగళవారం’ స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. కానీ హాట్‌స్టార్ ఈ మూవీ ప్రీమియర్ డేట్ ఎప్పుడు అనే విషయం ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ స్వయంగా వివరాలను వెల్లడించనుంది. నవంబర్ 17న ‘మంగళవారం’ థియేటర్లలో విడుదలయ్యింది కాబట్టి వచ్చేవారం ఓటీటీ ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

భయపెట్టే పాత్రలో ప్రియదర్శి..
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు అజ్మల్ అమీర్, నందితా శ్వేతా, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, దివ్య పిల్లై, రవీంద్ర విజయ్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రియదర్శి.. మొదటిసారి ‘మంగళవారం’తో వారిని భయపెట్టాడు కూడా. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై స్వాతి రెడ్డి గుణపాటి, సురేశ్ వర్మ, అజయ్ భూపతి.. ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. అజ్నీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం ‘మంగళవారం’ చిత్రానికి ప్రాణం పోసింది. ఇక చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పాయల్.. ‘మంగళవారం’తో ఫార్మ్‌లోకి వచ్చింది. అంతే కాకుండా ఇందులో తన నటన కూడా మేకర్స్‌ను ఆకట్టుకునేలా ఉండడంతో తనకు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయని ఆశపడుతోంది.

Also Read: అమ్మ క్లైమాక్స్ చూడలేదు, ఆ సీన్ చూడలేనని ఏడ్చేసింది - ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget