Thandel Movie: అట్టహాసంగా ‘తండేల్’ మూవీ లాంఛ్, ఏడాదిన్నరగా కష్టపడుతున్నామన్న నాగ చైతన్య
Sai Pallavi: నాగ చైతన్య తాజా చిత్రం ‘తండేల్’ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన మూవీ లాంఛింగ్ వేడుకలో పలువురు సీని ప్రముఖులు పాల్గొన్నారు.
Thandel Movie Muhurtham Ceremony: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించి ‘కస్టడీ’ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆశలన్నీ తన తదుపరి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.
అట్టహాసంగా ‘తండేల్’ సినిమా ప్రారంభం
తాజాగా ‘తండేల్’ సినిమా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఈ మూవీ ముహూర్తం వేడుక జరిగింది. ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు. వెంకటేష్ ఈ మూవీ ప్రారంభ సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నాగార్జున కెమెరా ఆన్ చేశారు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమా తెరకెక్కుతున్న‘తండేల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జోడీ కడుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘తండేల్’ ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏడాదిన్నరగా సినిమా కోసం కష్టపడుతున్నాం- నాగ చైతన్య
బతుకుతెరువు కోసం గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభం పట్ల హీరో నాగ చైతన్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీ కోసం గత ఏడాదిన్నరగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. “ఈ ఏడాదిన్నర కాలంలో ‘తండేల్’ సినిమా కోసం వేసిన ప్రతి స్టెప్ ను నేను ఎంజాయ్ చేశాను. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారుల కుటుంబాలను కలిశాం. స్ర్కిప్ట్ విషయంలోనూ అందరం కలిసి వర్క్ చేశాం. కొద్ది కాలం క్రితం అరవింద్ గారు ఇంటికి వచ్చారు. ఇది అన్ని సినిమాల మాదిరిగా కాదు. ఇది చాలా ప్రొటెన్షల్ ఉన్న కథ, తొందర పడకుండా, అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని చెప్పారు. ఆయన ఈ సినిమా కోసం మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ సక్సెస్ అయిన '100% లవ్’ ఆయనే నిర్మించారు. దర్శకుడు చందూ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఆయనతో కలిసి మూడో సినిమా చేస్తున్నాను. పల్లవితో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ ప్రారంభించబోతున్నాం” అని చెప్పారు. నాగ చైతన్య రీసెంట్‌గా వచ్చిన ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు.
Our #Thandel Raju aka Yuvasamrat @chay_akkineni arrives at the Muhurtham Ceremony ❤️🔥
— Geetha Arts (@GeethaArts) December 9, 2023
Watch live now!
- https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥@Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @KarthikTheeda @bhanu_pratapa… pic.twitter.com/fQR6FFT7Wd
The ever gracious @Sai_Pallavi92 is here at the #Thandel Muhurtham Ceremony ❤️🔥
— Geetha Arts (@GeethaArts) December 9, 2023
Watch live now!
- https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @KarthikTheeda @bhanu_pratapa… pic.twitter.com/GfMxTT5fvc
Victory @VenkyMama garu arrives at the #Thandel Muhurtham Ceremony to bless the team ❤️🔥
— Geetha Arts (@GeethaArts) December 9, 2023
Watch live now!
- https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop… pic.twitter.com/xzka2IEDOm
KING @iamnagarjuna garu graces the #Thandel Muhurtham Ceremony to extend his wishes and blessings to the team ❤️🔥
— Geetha Arts (@GeethaArts) December 9, 2023
Watch live now!
- https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas… pic.twitter.com/WWnv5evAFH
Read Also: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్