By: ABP Desam | Updated at : 26 Sep 2021 11:19 PM (IST)
రిలీజ్ డేట్ పై 'కేజీఎఫ్' టీమ్
రిలీజ్ డేట్ పై 'కేజీఎఫ్' టీమ్ మరోసారి క్లారిటీ:
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కేజీఎఫ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తుంది. గతేడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. దీంతో పలు బాలీవుడ్ సినిమాలు తమ సినిమా రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నాయి. ఈ క్రమంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజ్ డేట్ ఏమైనా మారుతుందేమోనని కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కేజీఎఫ్ టీమ్ మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. తమ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14నే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
'KGF2' HOLDS ON TO 14 APRIL 2022... Team #KGFChapter2 - which had finalised 14 April 2022 - is sticking to this date... No changes. #Yash #SanjayDutt #SrinidhiShetty #RaveenaTandon #KGF2 pic.twitter.com/V1JvGAHDfl
— taran adarsh (@taran_adarsh) September 26, 2021
Also Read: 'ఆదిపురుష్' సెట్స్ లో ప్రభాస్.. వైరలవుతోన్న లుక్..
పక్కకు తప్పుకున్న ఆమిర్ ఖాన్..:
బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు.
''థియేటర్లు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఐతే, కరోనా వల్ల మా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. కాబట్టి మా లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ఈ క్రిస్మస్ కి విడుదల చెయ్యలేక పోతున్నాం. వచ్చే వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 2022)కి మా సినిమా థియేటర్లలోకి వస్తుంది'' అని అమీర్ ఖాన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
#AamirKhan #KareenaKapoorKhan @Viacom18Studios #AdvaitChandan #AtulKulkarni #PritamDa #AmitabhBhattacharya #LaalSinghChaddha pic.twitter.com/aN5H6fG4dG
— Aamir Khan Productions (@AKPPL_Official) September 26, 2021
Also Read: ప్రియా సేఫ్.. లహరి ఔట్.. వెళ్తూ వెళ్తూ షణ్ముఖ్ తో ఫైట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు