అన్వేషించండి
Tollywood: 'బాహుబలి'కి ఏడేళ్లు - బ్యాంకాక్ చెక్కేసిన పూజాహెగ్డే!
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

'బాహుబలి'కి ఏడేళ్లు - బ్యాంకాక్ చెక్కేసిన పూజాహెగ్డే
'బాహుబలి'కి ఏడేళ్లు:
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన 'బాహుబలి' సినిమా విడుదలై ఈరోజుకి ఏడేళ్లు. దీంతో అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ప్రభాస్, రాజమౌళిలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి చెప్పిన విషయాలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బాహుబలి పార్ట్ 1 ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే!
7 years ago, @ssrajamouli's #Baahubali made the world witness the power of Indian Cinema💥
— Arka Mediaworks (@arkamediaworks) July 10, 2022
Thank you for continuing to shower us with your love & support#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty @tamannaahspeaks @mmkeeravaani @Shobu_ @arkamediaworks #7YearsForBaahubaliPride pic.twitter.com/mRaoevUw9D
బ్యాంకాక్ చెక్కేసిన పూజాహెగ్డే:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వెకేషన్ కి వెళ్లింది. మరో నెల రోజుల పాటు హాయినా ఎంజాయ్ చేయనుంది. టూర్ కి వెళ్తోన్న ఫొటోను షేర్ చేస్తూ.. 'నెల రోజులు.. మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఛలో #gypsiegirl' అంటూ రాసుకొచ్చింది. ముందుగా బ్యాంకాక్ కి వెళ్లింది పూజా. అక్కడ కొన్నాళ్లు గడిపి ఆ తరువాత తన టూర్ ని కంటిన్యూ చేయనుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లతో సినిమాలు చేస్తుంది. అలానే మహేష్ బాబు సినిమా కూడా ఒప్పుకుంది.
Also Read: 'హ్యాపీ బర్త్ డే'తో మత్తు వదిలిపోయింది!
View this post on Instagram
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
పర్సనల్ ఫైనాన్స్
న్యూస్





















