By: ABP Desam | Updated at : 29 Nov 2022 01:22 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకి చేరుకుంది. గత సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా ఫైనల్ కి వెళ్ళే సభ్యుల కోసం 'టికెట్ టు ఫినాలే' టాస్క్ తీసుకొచ్చారు. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్ కు చేరుకుంటారు. ఈ టాస్క్ గెలిచినవారు బిగ్ బాస్ 6 విన్నర్ గా నిలిచేందుకు ఫైనల్ కి చేరుకునే మొదటి వ్యక్తిగా గౌరవం పొందుతారు. దీంతో హౌస్‌మేట్స్ అంతా ఆ స్థానం కోసం గట్టిగానే పోటీపడ్డారు.
తాజా ప్రోమో ప్రకారం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ఒక టాస్క్ ఇచ్చారు. స్నో మెన్ రూపొందించాలని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఈ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ పంపించే స్నో మెన్ పార్ట్స్ తో వారి వారి స్నో మెన్ కట్టి ఆ పార్ట్స్ ని ఇతర ఇంటి సభ్యుల నుంచి కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్నో మెన్ పార్ట్స్ కోసం బాగానే కష్టపడ్డారు.
ఫైమా చేతికి చిక్కకపోవడంతో ఇనయా దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేసింది. కానీ ఇనయా మాత్రం తన దగ్గర ఉన్న వాటిని వదలకుండా గట్టిగా పట్టుకుంది. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా "అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం" అని సత్య వాదానికి దిగింది. తన స్నో మెన్ చెయ్యి ఎవరికైనా కావాలా అని సత్య అనగానే తనకివ్వమని ఫైమా అడుగుతుంది. అలా ఇచ్చుకోవడాలు లేవని సంచాలక్ గా ఉన్న రేవంత్ అడ్డుపడ్డాడు. అయినా వినకుండా ఎవరికైనా ఇస్తా అని సత్య మొండిగా అనేసరికి ఇచ్చుకోవడాలు లేవని రేవంత్ సీరియస్ గా చెప్పేశాడు.
ఇక సంచాలక్ గా ఉన్న రేవంత్ ని ఈ పోటీలో నుంచి ఎవరు తొలగిపోవాలో ఒక ఇంటి సభ్యుని పేరు చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. ఇక ఇంటి సభ్యులు పెట్టిన స్నో మెన్ గమనిస్తే రేవంత్ కరెక్ట్ గా బొమ్మని పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందరిలో కంటే కీర్తి బొమ్మ అసలు సరిగా లేదు. ఇక శ్రీ సత్య, ఫైమా, ఇనయా బొమ్మలు సగం కూడా పెట్టినట్టుగా కనిపించలేదు. ఇక ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు మాత్రం నేరుగా ఫైనల్ వెళ్ళే మొదటి వ్యక్తి అవుతారు.
Also read: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి
K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!
Janaki Kalaganaledu February 3rd: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిన అఖిల్, నిలదీసిన జెస్సి- జ్ఞానంబ ఇంట్లో మలయాళం ఎంట్రీ
K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!