Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి
బిగ్ బాస్ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూసే నామినేషన్స్ డే వచ్చేసింది. ఈ వారం ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారనేది కొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది.
సోమవారం అంటే నామినేషన్స్ డే. అందరూ దీని కోసం బాగా ఎదురు చూస్తారు. ఆరోజు కంటెస్టెంట్ల మనసులో ఉన్న కోపాలు, ఫీలింగ్స్ అన్ని బయటకి వచ్చేస్తాయి. గతవారం నామినేషన్స్ చప్పగా సాగేలా చేసిన బిగ్ బాస్.. ఈ వారం మళ్ళీ పాత విధానంలోకి వచ్చేశాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎక్కువగా ఆదిరెడ్డి గొంతు వినిపించింది. మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తూ ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినకుండా ప్రవర్తించాడు. గతంలో రేవంత్ కి తనకి మధ్య జరిగిన విషయం గురించే ప్రస్తావిస్తూ నామినేట్ చేశాడు.
తాజా ప్రోమో ప్రకారం ఇంట్లో ఎనిమిది మంది ఇంటి సభ్యులు మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో మోడల్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈవారం నామినేషన్స్ ప్రక్రియకి సంబంధించిన ప్రోమో వదిలారు. ఫైమా రోహిత్ ని నామినేట్ చేసింది. ఇంట్లో ఫిజికల్, స్ట్రాంగ్ గా ఉండేది రేవంత్ తర్వాత నువ్వే అంటూ ఫైమా రోహిత్ ని నామినేట్ చేసింది. ఇక ఆదిరెడ్డి గతంలో రేవంత్ కి తనకి మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. దానికి సంబంధించి వీడియో కూడా వేసి అప్పుడే నాగార్జున క్లారిటీ ఇచ్చారు. కానీ ఆదిరెడ్డి మళ్ళీ దాని గురించే మాట్లాడుతూ రేవంత్ తో వాదనకి దిగాడు. ‘‘ఆరోజు వేసిన వీడియోకి ముందు జరిగిన వీడియో అక్కడ లేదు. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఇంకొక పది సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మీద స్టాండ్ అయి ఉంటాను’’ అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ మాటకి రేవంత్ కూడా నాగార్జున గారు చూపించిన వీడియోకి స్టాండ్ అయి ఉంటానని గట్టిగా చెప్పాడు.
“నీకు నచ్చకపోతే వదిలేయ్” అని రేవంత్ అంటే “లేదు నేను చెప్తా. వింటే విను లేదంటే వెళ్ళి సోఫాలో కూర్చో” అనేసి ఆదిరెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. ఇక శ్రీహాన్ ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. ఇమ్యూనిటీ పవర్ కోసం చెక్ ఇచ్చి బిగ్ బాస్ ఎమౌంట్ రాయమన్న విషయంలో ఆదిరెడ్డి మాట్లాడిన మాటలు గురించి శ్రీహాన్ ప్రస్తావించాడు. రూ.1,50,000 రాసిన శ్రీహాన్.. రూ.లక్ష రాసిన వాడిని తక్కువ రాసి ఉంటే బాగుండేది అనడం కామెడీగా ఉందని ఆదిరెడ్డి కౌంటర్ వేశాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కాసేపు గట్టిగానే వాదన జరిగింది.
‘బిగ్ బాస్’ ముగింపుకు ఇంకొక రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లోకి వచ్చిన కొత్తలో రాజ్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాజ్ తన తల్లితో ఫోన్లో మాట్లాడాక చాలా ఛేంజ్ అయ్యాడు. నీ తప్పు లేనప్పుడు నువ్వు వెనక్కి తగ్గద్దు, వాదించు... అని తల్లి చెప్పడంతో నామినేషన్లలో గట్టిగా వాదించడం, అవసరమైతే గొడవపడడం కూడా చేశాడు. దీంతో అతనికి ఓట్లు పడడం మొదలైంది. ఇతను కూడా ఆట ఆడగలడు అని ప్రజలకు అర్థమైంది. అయితే ఇప్పుడు మరో వారంలో ఆట ముగియనుంది. మరొక్క వారంలో విజేత ఎవరో తెలిసిపోతుంది. ఈ సమయంలో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 9 కంటెస్టెంట్ గా నిలిచి, ఇంటి నుంచి బయటికి వెళ్ల బోతున్నాడు. కాకపోతే తన ఫ్యామిలి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చే వరకు ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ కోరిక తీరింది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా అతని తల్లి ఇంట్లోకి వచ్చారు. కొడుకును గెలిచి రావాలని కోరింది. చేతికి తాయెత్తు కట్టింది. దిష్టిచుక్క పెట్టింది. ఆ తర్వాతే రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.