అన్వేషించండి

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ వేదికపై కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు మెరిశారు.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 ముగింపుకు వచ్చేస్తోంది. అందుకే వీకెండ్ ఎపిసోడ్లను ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు బిగ్ బాస్ టీమ్. ఈ వారం వేదికపైకి కుటుంబసభ్యులను తీసుకొచ్చారు. వారితో పాటూ ఒక బుల్లితెర సెలెబ్రిటీ కూడా వచ్చారు. వారిలో కొంతమంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు ఉన్నారు. 

ఇనయా కోసం
ఇక ఎపిసోడ్లో కెప్టెన్ ఇనయాతో మొదలుపెట్టారు నాగార్జున. ఆమె తమ్ముడు ఇమ్రాన్, సోహెల్‌ను వేదికపై పిలిచారు. సోహెల్‌ను చూడగానే ఇనయా చాలా ఆనందపడింది. ఆమె ఫస్ట్ క్రష్ సోహెల్ అని చెప్పింది. ఆయన కోసమే మణికొండ షిఫ్ట్ అయ్యానని, అతను చేరిన జిమ్‌లోనే చేరానని చెప్పింది. ఈ విషయాన్ని సోహెల్ ఆమె చేత చెప్పించాడు. ఏడాది నుంచి సోహెల్‌ను ఫాలో అవుతున్నట్టు చెపింది. కాగా ఇనయా తమ్ముడు ఆమె ఆటలకు 8 మార్కులు ఇచ్చారు. ఈ హౌస్‌లో ఆమెకు కాంపిటీటర్ రేవంత్ అని, కాంపిటీషన్ కానిది ఆదిరెడ్డి అని చెప్పాడు. 

శ్రీహాన్ కోసం
ఇక శ్రీహాన్ కోసం అతని నాన్నతో పాటూ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీహాన్ - సిరి లవ్ స్టోరీని చెప్పించారు. శ్రీహాన్ తల్లి సిరి చేత అన్నయ్య అని పిలిపించేందుకు ప్రయత్నించిందని కూడా చెప్పారు. శివబాలాజీ శ్రీహాన్‌కి 9 మార్కులు ఇచ్చి, ఫైమా అతని కాంపిటీషన్ కాదని చెప్పాడు. అలాగే రేవంత్ గట్టి పోటీ ఇస్తున్నట్టు చెప్పాడు. 

ఫైమా కోసం
ఇక ఫైమా కోసం ఆమె అక్క సల్మా, బుల్లెట్ భాస్కర్ వచ్చారు. భాస్కర్ తన పంచులతో నవ్వించాడు. ముఖ్యంగా రేవంత్, ఇనాయపై అతను వేసిన పంచులు చాలా నవ్వు తెప్పించాయి. ఫైమాకి కాంపిటీషన్ ఇనాయ అని, కాంపిటీషన్ కానిది శ్రీసత్య అని చెప్పాడు. ఫైమాకి పది మార్కులు ఇచ్చాడు. 

రేవంత్ కోసం..
టైటివ్ ఫేవరేట్ రేవంత్ కోసం అతని అన్నయ్య వచ్చాడు. అతను బాహుబలిలా ఉన్నాడు. ఇతనితో పాటూ రోల్ రైడా కూడా వచ్చాడు. రేవంత్ చిన్నపట్నించి అల్లరేనని, టీచర్‌ని కూడా ఏడిపించే వాడిని, వీపును చూపి తగల్లేదు మేడమ్ ఇక్కడ కొట్టండి అనే వాడని గుర్తు చేసుకున్నాడు. 

రోహిత్ కోసం..
మిస్టర్ పర్‌ఫెక్ట్ రోహిత్ కోసం అతని సోదరుడు హిమాన్షు, సీరియల్ యాక్టర్ ప్రభాకర్ వచ్చారు. ఇతనికి కాంపిటీషన్ రేవంత్ అని, రాజ్ కనీసం కాంపిటీషన్ కాదని చెప్పారు.  వీళ్లు పెద్దగా మాట్లాడలేదు. ప్రభాకర్ మాత్రం రేవంత్ ని పొగడుతూ కనిపించాడు. దీనికి నాగార్జున మీరు వచ్చింది రోహిత్ కోసం కదా అని గుర్తొచ్చారు. 

ఆదిరెడ్డి కోసం...
ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మీ, మాజీ కంటెస్టెంట్ లహరి శారి వచ్చారు. అంధురాలైన నాగలక్ష్మిని నాగార్జున చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ఆమె అన్నయ్యను గెలిచి రమ్మని చెప్పింది. లహరి ఆదిరెడ్డిని చాలా పొగిడింది. తొమ్మిదన్నర మార్కులు ఆదికి ఇచ్చారు. రేవంత్ ఆదిరెడ్డికి కాంపిటీషన్ అని, శ్రీసత్య కాంపిటీషన్ కాదని చెప్పింది నాగలక్ష్మి. 

శ్రీసత్య కోసం
చికెన్ ప్రియురాలు శ్రీసత్య కోసం సీరియట్ నటి విష్ణుప్రియ, ఫ్రెండ్ హారిక వచ్చారు. ఆమె ఫ్రెండ్ హారిక మాట్లాడుతూ శ్రీసత్య ఎప్పుడూ తింటూ ఉంటుందని, ఫోన్ లేకపోతే ఉండలేదని చెప్పింది. తల్లి కోసం బెంగ పెట్టుకోవద్దని ఆమెకు రోజూ ఫిజియోథెరపీ జరుగుతోందని చెప్పింది. 

రాజ్ కోసం
మోడల్ రాజ్ కోసం డాక్టర్ వెంకీ, సాయి రోణక్ వచ్చారు. వెంకీ మాట్లాడుతూ రాజ్ చాలా సైలెంట్ అయిన వ్యక్తి అని చెప్పారు. ఇక రాజ్‌కి రోహిత్ కాంపిటీషన్ అని, ఇనాయ కాంపిటీషన్ కాదని చెప్పారు. 

కీర్తి కోసం...
ఫ్యామిలీ లేదని బాధపడుతున్న కీర్తికి ప్రియాంక, వితిక షేరూ వచ్చారు. వితిక షేరూ తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. ఆమెకు కాంపిటీషన్ శ్రీహాన్ అని, శ్రీసత్య కాంపిటీషన్ కాదని చెప్పింది. 

Also read: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget