News
News
X

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu: చిట్టచివరికి ఇనాయ తన కోరిక తీర్చుకుంది. ఇంటికి కెప్టెన్ అయింది.

FOLLOW US: 
Share:

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో ఆడపులి ఎవరంటే ఇనాయ పేరే చెబుతారు ఎవరైనా. ఈ సీజన్ ఆడవాళ్లలో టాస్కులు ప్రాణం పెట్టి ఆడింది ఆమెనే. అందునా ఇంటి కెప్టెన్ అవ్వడం కోసం ఎంతో కష్టపడింది. కానీ చివరి వరకు కాలేకపోయింది. ఆమె తల్లి ఆశ్వీర్వద బలమో ఏమో కానీ... ఇనాయ తల్లి ఇంట్లోకి వచ్చి కెప్టెన్ అవ్వాలి అని చెప్పింది. ఆ మరుసటి రోజే కెప్టెన్ పోటీలో గెలిచింది ఇనాయ. ఈ సీజన్ చివరి కెప్టెన్‌గా మారింది. ఇందుకోసం ఆమె చాలా గట్టిగా ఆడింది. 

మట్టి తింటున్న ఫైమా...
ఎపిసోడ్ మొదలవ్వడంతోనే ఫైమాను చూపించాడు బిగ్ బాస్. ఆమె గడ్డిలో మట్టి ఏరుకుని తింటూ కనిపించింది. దీంతో బిగ్ బాస్ ఆమెను కాసేపు ఆటపట్టించాడు. మీరెలాగు మీ ఆహారం వెతుక్కున్నారు కాబట్టి, మీ రేషన్ ఈ వారం కట్ చేస్తున్నట్టు చెప్పారు. ఫైమా... కీర్తి కూడా తింటుంది బిగ్ బాస్ అంటూ చెప్పింది. 

రేవంత్ భార్యతో...
రేవంత్ ఎప్పట్నించో తన భార్య గురించి బాధపడుతున్నాడు. నిండు గర్భిణి అయిన ఆమె ఎలా ఉందో చెప్పాలంటూ అడిగేవాడు. చివరికి అతని భార్య అన్విత వీడియో కాల్ మాట్లాడింది. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు రేవంత్. ఆమె తన పుట్టింట్లో ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ సమయంలో నువ్వు లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పింది అతని భార్య. దాంతో కన్నీరు పెట్టుకున్నారు రేవంత్. ఆమె మాట్లాడుతుండగానే సడెన్‌గా కట్ చేశాడు బిగ్ బాస్. 

తరువాత రేవంత్ తల్లి ఇంట్లోకి వచ్చారు. అతను గెడ్డం పెంచుకోవడం బాగోలేదని అన్విత చెప్పిందని చెప్పగానే, రేవంత్ వెంటనే గెడ్డం తీసుకుని వచ్చేశాడు. అలాగే కీర్తిని బాగా ఇష్టపడింది ఆమె. కీర్తికి ఇకపై తన కూతురని, ఎప్పుడైనా ఇంటికి రావచ్చని చెప్పింది. ఆమె కీర్తికి బాగా విలువ ఇవ్వడంపై మిగతా ఇంటి సభ్యులు మాట్లాడుకున్నారు. 

ఇక తరువాత కెప్టెన్సీ టాస్కు అయింది. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడొచ్చని చెప్పడంతో అందరూ పోటీ పడ్డారు. ఒక బంతిని మధ్యలో పెట్టి చుట్టూ ఇంటి సభ్యులంతా నిల్చున్నారు. ఎవరైనా ఆ బంతిని దక్కించుకుని పరిగెడతారో వారు ఆటలోనుంచి ఒకరిని ఎలిమినేట్ చేయచ్చు. అలా ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవ్వగా, చివరికి కీర్తి, శ్రీసత్య, ఇనాయ మిగిలారు. ఇందులో సపోర్ట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ లేకపోవడంతో ఇనాయ గట్టిగా ఆడి కెప్టెన్ పదవి దక్కించుకుంది. తన తల్లి వచ్చిన మరుసటి రోజే ఆమె కెప్టెన్ అయింది. 
ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. రెండు వారాల్లో సీజన్ ముగిసిపోనుంది. ఇంకా ఇంట్లో 9 మంది ఉన్నారు. ఫైనల్‌కి టాప్ 6 ఎంపిక చేస్తే వీరి నుంచి ముగ్గురిని ముందే ఎలిమినేట్ చేయాలి. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. 

Also read: బిగ్‌బాస్ ఇంట్లోకి రోహిత్ తల్లి ఎంట్రీ - మళ్లీ ‘వసపత్ర సాయికి’ అంటూ పాటందుకున్న రాజ్

Published at : 26 Nov 2022 07:53 AM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Income Tax Rule: బిగ్‌బాస్‌, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Income Tax Rule: బిగ్‌బాస్‌, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!

టాప్ స్టోరీస్

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?