The Raja Saab: ప్రభాస్ అభిమానుల రియాక్షన్.. మారుతి 'కమ్ టు మై రూమ్' సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్
The Raja Saab Review: ప్రభాస్ లెటెస్ట్ మూవీ ది రాజాసాబ్ సినిమా, రివ్యూలు చూసి ప్రేక్షకుల రియాక్షన్ వైరల్ అవుతోంది. మారుతి చెప్పిన డైలాగ్ నే వాడేశారు...

Prabhas fans reaction on director Maruthi: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ది రాజాసాబ్ థియేటర్లలోకి వచ్చేసింది. ఆ సినిమా చూసొచ్చిన అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మారుతి 'కమ్ టు మై రూమ్'...ఇప్పుడిదే ట్రెండింగ్
ప్రభాస్-మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చేసింది. వాస్తవానికి 2025 సమ్మర్లో రిలీజ్ కావాల్సిన సినిమా, ఆగష్టు అన్నారు..ఆ తర్వాత డిసెంబర్లో రావొచ్చన్నారు...ఎట్టకేలకు 2026 సంక్రాంతి బరిలో మొదటగా విడుదలైంది. బాహుబలి మొదలు వరుస యాక్షన్ మోడ్ లో ప్రభాస్ ని చూసిన అభిమానులంతా మరోసారి బుజ్జిగాడిని చూస్తాం అని సంబరపడ్డారు. బయటకు ఓకే అనుకున్నా మారుతి దర్శకత్వంలో అనేసరికి ఫ్యాన్స్ మనసులో ఏదో అలజడి, ఆందోళన ఉండనే ఉంది. హారర్ కామెడీ జోనర్ అని చెప్పడంతో కొంతవరకూ ఓకే అనుకున్నారు.. ఆ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత హమ్మయ్య అని గుండెపై చేయేసుకున్నారు. ది రాజాసాబ్ తో కొత్త ప్రభాస్ ని పాన్ ఇండియా ప్రేక్షకులు చూడబోతున్నారని సంబరపడ్డారు. పైగా సినిమా ప్రమోషన్లో భాగంగా మారుతి ఇచ్చిన హైప్ చూసి ఆశలు మరింత పెరిగాయ్
ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చితో మా ఇంటికి రండి అని ఛాలెంజ్ విసిరారు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ టైమ్ లో రాముడి గెటప్ లో ప్రభాస్ ఉన్న టైమ్ లో ముంబైకి వెళ్లి ఈ కథ చెప్పి నవ్వించాను. ప్రభాస్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రుణపడి ఉంటా అన్నారు.ఈ సినిమా మూడేళ్లు కష్టపడి తీశాం, ఎక్కడైనా మిమ్మల్ని ఒక్క శాతం డిజప్పాయింట్ చేస్తే మా ఇంటి అడ్రస్ పెడతా కమ్ టు మై హోమ్ అంటూ కొల్ల లగ్జోరియా, విల్లా నెంబర్ 17, కొండాపూర్ లో ఉంటుంది మా ఇల్లు అంటూ ఓపెన్ గా అడ్రస్ చెప్పారు. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ తో పాటూ ప్రభాస్ కూడా సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పడంతో ఎలాంటి భయం లేకుండా ధియేటర్లకో వెళ్లి భయపడుతూ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు.
కానీ థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకుడికి పూర్తిగా విభిన్నమైన ఫీలింగ్.. స్క్రీన్ పై ఏం జరుగుతోందో అర్థం కాదు. ఒక్క హీరోయిన్ వేస్ట్ అనుకున్న కథలో ముగ్గురు ముద్దుగుమ్మల సందడెందుకో అర్థంకాదు.. మారుతికి ప్రధాన బలం అయిన కామెడీ కూడా ఆశించిన రేంజ్ లో వర్కౌట్ కాలేదు. పాన్ ఇండియా కటౌట్ అయిన ప్రభాస్ ని చిన్న సినిమాల దర్శకుడు హ్యాండిల్ చేయగలడా అని స్టార్టింగ్ లో వచ్చిన సందేహానికి సరిగ్గా సమాధానం చెప్పేశారు మారుతి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చెబుతున్న మాట
సినిమా రిలీజ్ కు ముందు మారుతి...కమ్ టు మై హోమ్ అంటే... ఇప్పుడు ప్రేక్షకులు..మారుతి కమ్ టూ మై రూమ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్...
'రాజా సాబ్'లో ఆ సీన్స్ మిస్సింగ్ - డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ... సీక్వెల్‌లో ఉంటాయా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?






















