The Raja Saab Review : 'రాజా సాబ్'లో ఆ సీన్స్ మిస్సింగ్ - డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ... సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్‌గా...
The Raja Saab Reaction : ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలో కొన్ని సీన్స్ మిస్ కావడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించిన ఓల్డ్ లుక్ మూవీలో ఎక్కడా లేదని అంటున్నారు.

Fans Reaction On Prabhas The Raja Saab Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' గురువారం రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీలో ప్రభాస్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయినా కూడా కొంత నిరాశ చెందారు. టీజర్, ట్రైలర్‌లో చూసిన కొన్ని గూస్ బంప్స్ సీన్స్ మిస్ కావడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సీన్స్ ఏవీ 'రాజా సాబ్'
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఫస్ట్ ఓల్డ్ లుక్ అది పదింతలు చేసింది. మోషన్ పోస్టర్‌లో ప్రభాస్‌ను అలా చూడడం ఇదే ఫస్ట్ టైం. సింహాసనంపై రాజులా నోట్లో సిగార్‌తో కాలిపై కాలు వేసుకుని కాస్త ఓల్డ్ గెటప్‌లో డార్లింగ్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది. అటు, ట్రైలర్స్‌లోనూ ఆ లుక్‌ను హైలెట్ చేశారు.
అయితే, సినిమాలో మాత్రం ఆ లుక్స్, సీన్స్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సీన్స్ ఏవీ 'రాజా సాబ్' అంటూ డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఆ లుక్ మూవీలో పెట్టకపోయినప్పుడు ట్రైలర్, టీజర్‌లో ఆ సీన్స్ ఎందుకు పెట్టారంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఫ్యాన్స్.
సంక్రాంతి నుంచి
దీనిపై రియాక్ట్ అయిన మూవీ టీం సంక్రాంతి నుంచి ఆ సీన్స్ మూవీలో యాడ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, మూవీ క్లైమాక్స్‌లో ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. సీక్వెల్ అనౌన్స్ చేస్తూ హింట్ ఇచ్చారు. రిలీజ్ ట్రైలర్‌లో జోకర్‌గా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. మూవీలో అది ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు జోకర్ లుక్ చూపిస్తూనే సీక్వెల్ ఉంటుందంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి 'రాజా సాబ్ సర్కస్ 1935' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
#TheRajaSaab
— knitt (@Knitt_App) January 9, 2026
So does this mean this entire look's plot line was completely scrapped?
Wow. Not complaining — it could’ve easily deviated from the actual story — but it’s still a bizarre choice to promote this look and several scenes so heavily when they don’t even exist in the… pic.twitter.com/9Ugfv4VwMq
You showed a powerful scene in teasers & trailers, created massive hype… and then removed it from the film? 🤦♂️
— Actress💃Actors 🕺 (@actressactorss) January 9, 2026
This is not marketing, this is misleading the audience. Fans deserve better respect 🙏🏼 @peoplemediafcy @DirectorMaruthi @SKNonline#TheRajaSaab #TheRajaSaab pic.twitter.com/oCb0qrNsed
Also Read : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?






















