The Raja Saab Sequel : ప్రభాస్ 'ది రాజా సాబ్' సీక్వెలా? ప్రీక్వెలా? - జోకర్‌గా డార్లింగ్... టైటిల్ ఏంటో తెలుసా?
The Raja Saab Review : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్‌లో డైరెక్టర్ మారుతి సీక్వెల్‌పై సూపర్ హింట్ ఇచ్చాడు. టైటిల్ ఫిక్స్ చేయడం సహా డార్లింగ్ రోల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.

Prabhas The Raja Saab Sequel Announced : డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మారుతి దర్శకత్వం వహించిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' గురువారం రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీలో ప్రభాస్ యాక్టింగ్, కొన్ని సీన్స్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక క్లైమాక్స్‌లో ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మారుతి.
'ది రాజా సాబ్' సీక్వెల్
ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి జోకర్‌గా ప్రభాస్ లుక్ ఇంట్రడ్యూస్ చేశారు. సీక్వెల్‌కు 'రాజా సాబ్ సర్కస్ 1935' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజానికి ట్రైలర్‌లో చూపించిన చాలా సీన్స్ సినిమాలో లేవు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, ఆ సీన్స్ సీక్వెల్‌లో ఉంటాయని భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇది ప్రీక్వెల్ కూడా కావొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది సీక్వెలా లేక ప్రీక్వెలా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో సీక్వెల్ కథలు రెడీగా ఉన్నాయి. వాటితో పాటే ఇది కూడా యాడ్ అయ్యింది. సలార్, కల్కి 2898 AD మూవీస్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, ఈ మూవీకి కూడా సీక్వెల్ రానుంది. ప్రభాస్ జోకర్‌గా చేస్తున్నారనే హింట్ ఇవ్వడంతో ఇప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read : 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
ఫ్యాన్స్ సందడి
అటు గురువారం రాత్రి నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఏపీలోని ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద భారీ కటౌట్స్, సంబరాలతో డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే, తెలంగాణలో ప్రీమియర్ షోలపై గురువారం రాత్రి 10 వరకూ కూడా క్లారిటీ రాలేదు. దీంతో తీవ్ర నిరాశలో మునిగిపోయిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఆందోళనకు దిగారు. ప్రీమియర్స్ వేస్తే తప్ప బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. థియేటర్ల యాజమాన్యం, పోలీసులు వారికి నచ్చచెప్పేందుకు యత్నించినా వినలేదు.
ఈ క్రమంలో రాత్రి 11:30 గంటలకు తీవ్ర ఉత్కంఠ నడుమ ప్రీమియర్ షోస్ వేశారు. గురువారం అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరలు రూ.300 కాగా ఆ తర్వాత షోలకు టికెట్ ధరల పెంపు వర్తించనుంది. ప్రస్తుతం టికెట్ ధర ఆయా థియేటర్లను బట్టి రూ.500గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలివే
తెలంగాణలో శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్సుల్లో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఇక 12 నుంచి 18వ తేదీ వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్సుల్లో రూ.89 వరకూ పెంచుకోవచ్చు. అలాగే టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
ఏపీలో ప్రీమియర్ షో ధర రూ.1000 కాగా సింగిల్ స్క్రీన్లలో రూ.150 వరకూ... మల్టీప్లెక్సుల్లో రూ.200 వరకూ పెంచుకోవచ్చు. ఫస్ట్ 10 రోజుల వరకూ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.






















