Sushmita Sen: నాకు గుండెపోటు వచ్చింది - బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సంచలన పోస్టు!
తనకు కొద్ది రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చిన విషయాన్ని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రకటించింది.
![Sushmita Sen: నాకు గుండెపోటు వచ్చింది - బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సంచలన పోస్టు! Sushmita Sen Informed That She Suffered A Heart Attack Couple of Days Back Sushmita Sen: నాకు గుండెపోటు వచ్చింది - బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సంచలన పోస్టు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/30/4ae764a36410e8b610f937983a5dcce61675063536755209_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sushmita Sen Heart Attack Update: బాలీవుడ్ ప్రముఖ నటి సుస్మితా సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీస్‌లో కూడా సుస్మితా సేన్ సినిమాలు చేశారు. ఈ సమయంలో సుస్మితా సేన్ గురించి పెద్ద న్యూస్ బయటకు వచ్చింది.
సుస్మిత కొన్ని రోజుల క్రితం తనకు మొదటి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో తెలిపింది. సుస్మితా సేన్ స్వయంగా చేసిన ఈ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే విపరీతంగా వైరల్ అయింది. ఫ్యాన్స్ అందరూ తను ఎలా ఉందో కనుక్కోవడం ప్రారంభించారు.
సుస్మితా సేన్‌కు గుండెపోటు
గురువారం సుస్మితా సేన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తాజా పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ ఇన్‌స్టా పోస్ట్‌లో సుస్మితా సేన్ తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో క్యాప్షన్‌లో సుస్మితా సేన్ ఇలా వ్రాశారు 'నీ హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా ఉంచమని నా తండ్రి సుబీర్ సేన్ చెప్పారు. మీకు అవసరమైనప్పుడు అది ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత యాంజియోప్లాస్టీ చేసి, స్టెంట్ వేశారు. నా గుండె పెద్దదని గుండె నిపుణుడు చెప్పారు.
'సరైన సమయంలో చేసిన నాకు సహాయం చేసిన, సపోర్ట్ చేసిన చాలా మందికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అది వేరే పోస్ట్‌లో చెబుతాను. ఈ పోస్ట్ ద్వారా అంతా బాగానే ఉందని, నేను మళ్ళీ జీవితానికి సిద్ధంగా ఉన్నాననే శుభవార్తతను నా శ్రేయోభిలాషులకు, ప్రియమైనవారికి తెలియజేయాలనుకుంటున్నాను. నేను మీ అందరిని చాలా ప్రేమిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
ఇక సుస్మితా సేన్ వర్క్ గురించి చెప్పాలంటే రాబోయే కాలంలో,సూపర్‌హిట్ వెబ్ సిరీస్ 'ఆర్య' సీజన్ 3 (Aarya 3) లో కనిపిస్తుంది. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా ట్రాన్స్‌జెండర్ శ్రీ గౌరీ సావంత్ జీవితం ఆధారంగా రూపొందించిన 'తాలి' బయోపిక్‌లో కూడా సుస్మితా సేన్ తన నటనా నైపుణ్యాన్ని చూపించనుంది.
సుష్మితా సేన్, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ గతంలో కొన్నాళ్లు డేటింగ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మాల్దీవుల నుంచి ఇటలీ వరకు వాళ్లిద్దరూ ట్రిప్ వేశారు. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందట.
సుష్మితా సేన్‌తో డేటింగ్ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లలిత్ మోడీ (Lalit Modi) తన డీపీ (డిస్‌ప్లే పిక్చర్) చేంజ్ చేశారు. ఆమెతో దిగిన ఫోటో ఉంచారు. ఆ తర్వాత బయోలో సుస్మితను తన ప్రేయసిగా పేర్కొన్నారు. రెండు నెలలకు మళ్ళీ అంతా తారుమారు అయ్యింది.
ఇప్పుడు లలిత్ మోడీ ఇన్‌స్టా డీపీలో సుస్మితతో దిగిన ఫోటో లేదు. అది తీసేసి తన ఫోటో మాత్రమే పెట్టుకున్నారు. పోనీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ మార్పు చేశారని అనుకున్నా... బయోలో కూడా సుస్మిత పేరు తీసేశారు. దాంతో ఇండస్ట్రీలో జనాలకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా... లలిత్ మోడీ, సుస్మితా సేన్ ప్రేమకథకు ఫుల్ స్టాప్ పడిందని, ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని వినబడుతోంది. అయితే... సుష్మితతో ఫోటోలు మాత్రం ఆయన సోషల్ మీడియాలో ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)