Sukumar Speech: బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
Sukumar: రావు రమేష్ హీరోగా నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ వచ్చారు. ఆయన భార్య తబిత సుకుమార్ ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.
Sukumar Speech in Maruti Nagar Subramanyam Pre Release Event: ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమా గురించి ట్వీట్ చేసినందుకు దర్శకుడు సుకుమార్ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. తబిత (సుకుమార్ భార్య) తనకు కూడా తెలియకుండా రామ్ చరణ్‌తో ట్వీట్ వేయించారని, అలా సపోర్ట్ చేసినందుకు రామ్ చరణ్‌కు థ్యాంక్స్ అని అన్నారు. ఇదే ఈవెంట్‌కు అల్లు అర్జున్ కూడా చీఫ్ గెస్ట్‌గా వచ్చారు.
‘పుష్ప 2’ క్లైమ్యాక్స్ షూట్‌లో బిజీగా ఉన్నప్పటికీ మూడు గంటల సమయం ఇచ్చి ఈ సినిమా చూశానని, బాగా ఎంజాయ్ చేశానని ఆయన అన్నారు. అల్లు అర్జున్ ఈ ఈవెంట్‌కు రావడం వెనక కూడా తన ప్రమేయం లేదని, తబిత నేరుగా అల్లు అర్జున్‌ను అడిగారని తెలిపారు. అలాగే అడగ్గానే వచ్చినందుకు అల్లు అర్జున్‌కు కూడా థ్యాంక్స్ చెప్పారు.
Also Read: యాంకర్ రష్మీ ఇంట విషాదం - సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
‘పుష్ప 2’ సినిమా గురించిన అప్‌డేట్ కూడా సుకుమార్ ఇచ్చారు. ‘పుష్ప 1’ తమ కోసం తాము చేసుకున్నామని, ‘పుష్ప 2’ మాత్రం అభిమానుల కోసం చేస్తున్నామని చెప్పారు. సినిమా లేట్ అవ్వడం వెనక ఉన్న కారణం కూడా చెప్పీ చెప్పకుండా రివీల్ చేశారు. కొన్నిసార్లు ఒక రోజు తీయాల్సిన సీన్ రెండు రోజులు తీశామని పర్ఫెక్ట్‌గా వచ్చే దాకా వెయిట్ చేశామని అన్నారు. ‘పుష్ప 2’ ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6వ తేదీన వచ్చి తీరుతుందని నొక్కి నొక్కి మరీ చెప్పారు.
డిసెంబర్ 6వ తేదీన రావాల్సిన ‘పుష్ప 2’ ఆలస్యం అవుతుందని గత కొంత కాలంగా రూమర్లు వస్తున్నాయి. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల మధ్య విభేదాలు చాలా గట్టిగా వచ్చాయని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని, 2025 సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ‘చావా’, తెలుగులో బ్రహ్మానందం నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ సినిమాను కూడా డిసెంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘పుష్ప 2’ కచ్చితంగా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్న ‘పుష్ప 2’ డిసెంబర్‌కు రావడం పక్కా అని తేలిపోయింది.
'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించాడు. ఇప్పటికే ‘ఆయ్’ సినిమాతో అంకిత్ కొయ్య సక్సెస్ అందుకున్నారు. తాను అల్లు అరవింద్ ఫ్యామిలీలో పుట్టానని, 'అల వైకుంఠపురములో' సినిమా టైపులో తనను చిన్న ఇంటికి తీసుకు వచ్చారని, బన్నీ తన అన్నయ్య, అల్లు అరవింద్ తన తండ్రి అని ఊహల్లో బ్రతికే క్యారెక్టర్ అతడిదని విడుదల అయిన ప్రమోషనల్ కంటెంట్‌ను చూస్తే తెలుస్తోంది. ఇదే సినిమాలో ఉన్న 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటలో కూడా అల్లు అర్జున్ రిఫరెన్సులు పూర్తిగా వాడేశారు. ఆగస్టు 23న ఈ సినిమా విడుదల కానుంది.
Read Also: చెల్లెలుగా చేసిన రమ్యకృష్ణతో రొమాన్స్ ఎలా చేశారు? రిపోర్టర్ ప్రశ్నకు చిరంజీవి మెగా కౌంటర్