By: ABP Desam | Updated at : 03 Nov 2021 11:13 PM (IST)
విజయ్ సేతుపతిపై ఎటాక్ వెనుక అసలు స్టోరీ ఇదే..
బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా.. విజయ్ సేతుపతిపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. విజయ్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంది..? అది కూడా ఎయిర్ పోర్ట్ లో అనే సందేహాలు తలెత్తాయి. దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. అసలేం జరిగిందంటే... ఇటీవల కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నటుడు విజయ్‌సేతుపతి బెంగళూరు వచ్చారు.
Also Read: విజయ్ సేతుపతిపై దాడి.. ఎగిరి మరీ తన్నాడు..
భద్రతా సిబ్బంది సహాయంతో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్తుండగా, ఆయన పక్కనే ఉన్న సహాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఎగిరి కాలితో ఎగిరి తన్నాడు. ఈ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడికి యత్నించిన వ్యక్తిని వెనక్కి లాగేశారు. ఈ సంఘటనతో విజయ్‌సేతుపతి అవాక్కయ్యారు. వీడియో బయటకు వచ్చినప్పుడు అందరూ విజయ్ పై దాడి జరిగినట్లు భావించారు. కానీ అతడి సహాయకుడిపై అని స్పష్టత వచ్చింది.
ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న కొద్దిసేపటి ముందు మద్యం సేవించి ఉన్న సదరు వ్యక్తితో విజయ్‌సేతుపతి సహాయకుడు వాగ్వాదానికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ కోపంతోనే సహాయకుడిని కాలితో తన్నాడని అంటున్నారు. భద్రతా సిబ్బంది జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాడని తెలుస్తోంది.
Actor #VijaySethupathi attacked at Bengaluru airport. Initial reports say the incident happened yesterday night. More details awaited... pic.twitter.com/07RLSo97Iw
— Janardhan Koushik (@koushiktweets) November 3, 2021
Also Read: 'దీపావళి పండగ ముందే వచ్చేసింది..' 'లాలాభీమ్లా' ప్రోమోలో పవన్ మాస్ అవతార్..
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?
Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్
Muttiah Muralitharan : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
టిబెట్ విషయంలో దలైలామా వెనక్కి తగ్గారా? స్వాతంత్య్రం వద్దనడం వెనక ఉద్దేశమేంటి?
/body>