By: ABP Desam | Updated at : 15 Feb 2023 10:51 AM (IST)
శ్రీ సత్య
'బిగ్ బాస్' ఫేమ్ శ్రీ సత్య (Sri Satya), మెహబూబ్ దిల్ సే (Mehaboob Dilse) మధ్య ఏం జరుగుతోంది? ఆమెతో అతడు ప్రేమిస్తున్నాడా? రీల్ జోడీ కాస్తా రియల్ జోడీగా మారుతుందా? లేటెస్టుగా మెహబూబ్ విడుదల చేసిన వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం శ్రీ సత్య కోసం కళ్యాణ్, మెహబూబ్ గొడవ పడ్డారు. ఇప్పుడు ఏమో ఏకంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు.
శ్రీ సత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్!
Valentine's Day Prank Video : ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యతో కలిసి మెహబూబ్ ప్రాంక్ వీడియో చేశారు. అందులో ఆమెకు అతడు ప్రపోజ్ చేశాడు. అప్పుడు శ్రీ సత్య చెప్పిన కొన్ని మాటలు వీడియో చూసే జనాలకు షాక్ ఇచ్చాయి.
కరెక్ట్ పర్సన్స్ ఎవరూ ఉండరు! - శ్రీ సత్య
మెహబూబ్ ప్రపోజ్ చేసిన తర్వాత... ''ఆల్రెడీ నా జీవితంలో మొత్తం పెంట అయ్యింది మెహబూబ్! మళ్ళీ కొత్త పెంట తీసుకొచ్చి... బేసిగ్గా నాకు మనుషుల మీద ఫీలింగ్ లేవు. నాకు ఫీలింగ్స్ రావు. ఉండవు కూడా'' అని శ్రీ సత్య సీరియస్ అయ్యారు. అప్పుడు ''ఎవరో చేసిన దానికి నేను ఏమీ చేయలేను కదా'' అని మెహబూబ్ చెప్పగా... ''ఆల్రెడీ ఒకసారి పోయినప్పుడు నేను ఇంకెవరితో ఉండాలని అనుకోవడం లేదు'' అని ఆమె చెప్పారు.
మెహబూబ్ ప్రపోజల్ పట్ల శ్రీ సత్య సీరియస్ అవుతుంటే... ''కరెక్ట్ పర్సన్స్ వస్తే'' అని మెహబూబ్ చెప్పబోయారు. ''అసలు కరెక్ట్ పర్సన్స్ అంటూ ఎవరూ ఉండరు. రేపు నీకు ఇంకొక అమ్మాయి నచ్చదని గ్యారెంటీ ఏంటి?'' అని శ్రీ సత్య క్వశ్చన్ చేశారు.
నా జీవితంలో పెళ్ళి లేదు! - శ్రీ సత్య
ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్షిప్‌లో ఉండాలని అనుకొవడం శ్రీ సత్య కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆల్రెడీ 'బిగ్ బాస్ హౌస్'లోనూ పెంట అయ్యిందని, ఇప్పుడు కూడా అలాగే అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారీ డిస్కషన్ తర్వాత చెయ్యి కోసుకుంటున్నట్లు మెహబూబ్ యాక్ట్ చేయగా... తాను ఒకసారి సూసైడ్ చేసుకున్నట్లు శ్రీ సత్య చెప్పారు. అది ప్రేక్షకులకు పెద్ద షాక్ అని చెప్పాలి. తనకు బ్యాడ్ పాస్ట్ ఉండటంతో ఎవరితో ప్రేమలో పడాలని అనుకోవడం లేదని ఆమె వివరించారు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
చూసేది ప్రాంక్ వీడియో అయినప్పటికీ... అది మెహబూబ్ ప్లాన్ చేశాడు కాబట్టి శ్రీ సత్యకు ఏమీ తెలియదని, ఆమె చెప్పేది నిజాలు అని ఆడియన్స్ అనుకున్నారు. చివరకు, రివీల్ చేసింది ఏంటంటే... శ్రీ సత్యతో కలిసి మెహబూబ్ ఈ ప్రాంక్ వీడియో ప్లాన్ చేశాడని! కొరియోగ్రాఫర్స్ సంకీర్త్, ప్రియాంకను వాళ్ళు బకరాలు చేశారని!
'స్టార్ మా'లో ప్రసారమవుతోన్న 'బీబీ (బిగ్ బాస్) జోడీ' డాన్స్ ప్రోగ్రామ్ (BB Jodi Telugu )లో మెహబూబ్, శ్రీ సత్య జంటగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళకు సంకీర్త్, ప్రియాంక కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ జోడీ చేసే పాటల్లో రొమాన్స్ కనబడుతూ ఉంటుంది. అందుకని, వాళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు.
Also Read : నిత్యా మీనన్ పోయె, గీతా మాధురి వచ్చె - ఆహా షోలో మార్పులోయ్!
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?
Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !