News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

karthika Deepam Serial Today Episode: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం.. డాక్టర్ బాబు , వంటలక్కకి రుద్రాణి నుంచి కొత్త కష్టాలు..

కార్తీక దీపం ఈ రోజు (గురువారం) ఎపిసోడ్ లో సీరియల్ కొత్త మలుపు తిరిగింది. పిల్లలతో సహా ఇంట్లోంచి వెళ్లి పోయిన డాక్టర్ బాబు, దీప తాడికొండ గ్రామానికి వెళ్తారు. ఇక్కడి నుంచి కథ వేరే ఉండేట్టే ఉంది.

FOLLOW US: 
Share:

దీప పక్కన ఉన్నంత కాలం కార్తీక్ ఓడిపోడు దీప గెలిపిస్తుందని కార్తీక్ తండ్రి ఆనంద్ రావు ఎమోషనల్ అవుతాడు. డాక్టర్ బాబు ముందుకి తూలి పడబోతుంటే 'కొండకోన పాలైన సీతమ్మ మదిలోనా కోపమైన రాలేదు రామయ్య పైన' అనే సాంగ్ బ్యాంగ్రౌండ్ లో ప్లే అయింది.  ఇక శౌర్య, హిమలు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం,  ఫోన్స్ ఎందుకు లేవు  అని శౌర్య అడుగుతుంది.  మనం ప్రశాంతంగా ఉండాలని ఫోన్స్ కూడా తీసుకుని రాలేదు.. నా దగ్గర మాత్రమే ఉంది.. అది కూడా కొత్త నంబర్.. ఇక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూదని ఫోన్స్ తీసుకురాలేదని దీప అంటుంది. మరి హాలీడే అయితే బస్సులో రావడం ఎందుకు, హాయిగా కారులో రావొచ్చు కదా, ఎండలో ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది హిమ.  కాళ్లు నొప్పులు పుడుతున్నాయా? ఎత్తుకోవాలా? హిమని కార్తీక్ దీనంగా అడుగుతాడు. స్పందించిన దీప పిల్లల్ని ఇప్పటికే బాగా గారాబం చేశాం ఇక చాలు, వారికి నడక అలవాటు చేయాలని అంటుంది. పర్లేదులే అమ్మా మేం నడుస్తాం అంటుంది హిమ. ఇంతకీ మనం వెళ్లే రిసార్ట్ ఎక్కడ, ఎలా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉందా, ఉదయం సూర్యుడు కనిపించాలి, సాయంత్రం చంద్రుడు రిసార్ట్ లోకి కనిపించాలని కోర్కెల చిట్టా విప్పుతుంది. 
Also Read: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
మరోవైపు శ్రావ్య కాఫీ, టిఫిన్ తీసుకొచ్చి సౌందర్య, ఆనంద్ రావు ముందు పెడుతుంది. ఇలా తినకుండా ఉంటే ఎలా.. అసలే మీ ఆరోగ్యం బాగా లేదంటుంది.  ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అని శ్రావ్యపై ఆదిత్య ఫైర్ అవుతాడు. మనమంటే ఓర్చుకుంటాం.. అత్తయ్య మామయ్యలు తినకుండా ఉంటే ఎలా? అని శ్రావ్య సమాధానం చెబుతంది. మమ్మీ నేను కనుక్కుంటాను.. నా ఫ్రెండ్స్, పోలీస్ వాళ్లకు చెప్పాను, సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేయోచ్చట అని ఆదిత్య అంటే.. బావగారికి ఆ మాత్రం తెలీదా? అని శ్రావ్య బధులిస్తుంది. నా ఫ్రెండ్స్ అంతా వెదుకుతున్నారు అని ఆదిత్య అంటాడు.. ఇక ఇంతలో మోనిత ఎంట్రీ ఇస్తుంది. నమస్తే.. అయ్యయ్యో కుడికాలు పెట్టాలి కదా? అని ఎంట్రీ ఇస్తుంది. మీ డాడీకి ఐ లవ్యూ చెప్పి సరిగ్గా 18 ఏళ్లు అయింది ఆనందరావుగారు, కాలం కరిగిపోయింది, మీ నాన్న మీద ప్రేమ పెరిగిపోయింది , నా ప్రేమకు అలుపు లేదు, కొందరు గిట్టని వాళ్లు బలుపు అని అనుకుంటారు.. కానీ ఏం చేస్తాం నువ్వు, నేను, మీ నాన్న కలిసి ఉండాలంటే.. మీ నాన్న మీ నాన్నే అని మీ నాన్నతో అనిపించాలంటే తప్పదు కదా అంటూ కొడుకుతో అంటుంది. కార్తీక్ అంటూ అరుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. 
Also Read: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..
మెట్లవరకూ వెళ్లిన మోనిత వెనక్కు వచ్చి  నమస్తే మామయ్య గారు, నమస్తే ఆంటీగారు, హలో ఆదిత్య, హలో శ్రావ్య అంటూ  చూశావా? అందరూ ఉన్నారు. మీ నాన్న లోపలున్నారు, పెద్దమ్మ లోపల ఉంది ఇప్పుడు వస్తుందిలే అంటుంది.  పెద్దమ్మ కళ్లు ఇలా ఉరిమి చూస్తుంది తెలుసా అంటుంది మోనిత. ఇంతలో ఇక్కడ బావగారు లేరు అని శ్రావ్య  చెబుతుంది.. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాడు శ్రావ్య.. హాస్పిటల్‌కా? బయటకా? అని మోనిత అడుగుతంది. నీ పుణ్యమా అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. నీ బాధలు పడలేక, సమాజంలో అవమానాలు ఎదుర్కోలేక వెళ్లిపోయాడు. కార్తీక్ కార్తీక్ అంటూ మా ఇంటి పరువుతీశావ్ కదా? మాకు మొహం చూపించుకోలేక ఇంట్లోంచి వెళ్లిపోయాడు అని ఆదిత్య చెబుతాడు. వెళ్లిపోయాడా? ఈ ఐడియా బాగుంది నీదేనా? ఆదిత్య అని మోనిత కౌంటర్లు వేస్తుంది.  మోనిత నీతో వాదించే ఓపిక నాకు లేదు..నోటికొచ్చినట్టు వాగితే ఊరుకునేది లేదని ఆదిత్య ఫైర్ అవుతాడు.
Also Read: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..
అప్పుడు అమెరికా అన్నారు.. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లాడని కథలు చెబితే నమ్ముతా అనుకుంటున్నారా..  నెవ్వర్.. ఈ మోనిత చాలా ముదురు.. అని మోనిత అనగానే సౌందర్య స్టార్ట్ చేస్తుంది. నీకు దండంపెడతాను మోనిత ఇప్పటికే చాలా బాధలో ఉన్నాం వెళ్లిపో అని అంటుంది. వీళ్లంతా ఇలా ఏడుస్తున్నారంటే బాగా నటిస్తున్నారా? లేదంటే నిజంగానే వెళ్లిపోయాడా? వెళ్లి ఉండొచ్చు అని మోనిత లోలోపల అనుకుంటుంది. అయినా నా ప్రేమలో ఎలాంటి తేడా ఉండదంటుంది. ఆంటీగారు మీ కొడుకు పెళ్లాం, పిల్లలతో వెళ్లిపోతే మరి నా కొడుకు సంగతేంటని అడుగుతుంది మోనిత.  ఏంటమ్మ ఇది.. కార్తీక్ ఎక్కడికి వెళ్లాలో తెలియక మేం బాధపడుతుంటే ఇలాంటి సమయంలో ఏంటమ్మ అని ఆనంద్ రావు అడుగుతాడు. మామయ్య గారు ఒకటి చెప్పాలా? మీది కడుపు కోత నాది గుండెకోత, పద్దెనిమిదేళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. నా బాధ ఎవరు చూశారు, నా కన్నీళ్లు ఎవరు చూశారు..ఇప్పుడు ఈ బిడ్డకి  ఏం న్యాయం చేస్తారు? వంటలక్కలా బస్తీలో గడిపే ఓపిక నాదులేదంటుంది.
Also Read: టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?
మోనిత మాటలు విని రియాక్టైన ఆదిత్య నువ్వు మనిషివేనా, నీకు బుద్ధుందా గెటవుట్ అంటూ అరుస్తాడు.  ప్లీజ్ ఆదిత్య ఆగు అని సౌందర్య మాట్లాడుతూ.. నీతో మాట్లాడే ఓపిక మాకు లేదు,  ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఆదిత్య కోపం గురించి నీకు బాగా తెలుసు వాడు కోపంలో ఏం చేసినా తరువాత బాధపడకు వెళ్లిపో అని సౌందర్య అంటుంది. నాకు ఈ ఇంటికి సంబంధం లేదా? పేగు మెళ్లో వేసుకుని పుట్టినప్పుడు మనవడా... ఈ బిడ్డతో దోష నివారణ పూజ చేయించారు కదా? అప్పుడు మనవడు అన్నారు కదా? క్షణానికి ఒకలా ఉంటారేంటి. 18 ఏళ్లుగా  ప్రేమ కురుక్షేత్రం చేస్తున్నాను. నేను ఎప్పటికైనా గెలిచి తీరుతాను.. ఒక మాట అంటే ఆ మాట మీదే ఉండాలి ఆంటీగారు. అప్పుడు మీరే మనవడు అంటారు,  ఇప్పుడు కాదంటారు. అప్పుడు రమ్మని బతిమలాడారు, ఇప్పుడు వెళ్లిపోమంటున్నారు.  మీ కన్నీళ్లు చూస్తుంటే నిజమే అని నమ్మాలనిపిస్తోంది..సరే ఎక్కడికి వెళ్లారో, మీరే పంపారో నిజమేంటో తెలుసుకుంటానంటూ మోనిత పదండి ఆనందరావు గారు అంటూ  అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 
Also Read: హే..సిద్దార్థ్ మళ్లీ ఏసేశాడు..
ఎక్కడున్నావ్,  ఏం చేస్తున్నావ్, ఏం తింటున్నావ్ రా అని సౌందర్య కొడుకుని తలుచుకుని ఏడుస్తుంటుంది. మరోవైపు పిల్లలు రకరకాల ప్రశ్నలు వేస్తుంటే నాన్నను డిస్టర్బ్ చేయకండి అని చెబుతుంది దీప.  నిన్ను ఏం అడగం లే  నువ్ ఇలా డల్‌గా ఉండకు అందరం కలిసి ఉంటే చాలు అని కార్తీక్‌తో హిమ, శౌర్య అంటారు. ఇంతలో అక్కడకి వచ్చిన ఓ మహిళ దీపను చూసి  ఎవరు మీరు ఈ ఊళ్లో ఎప్పుడూ చూడలేదని అంటుంది.  నా పేరు దీప అని మన వంటలక్క చెబితే..నా పేరు శ్యామల అని ఆ మహిళ చెబుతుంది. ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చామని దీప అంటే ఏ పని దొరుకుతుంది పని సంగతి దేవుడెరుగు ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? అని శ్యామల భయపెడుతుంది. ఎవరండీ ఆవిడ అని దీప అంటుంది. రుద్రాణి..ఊళ్లో ఆపేరు చెబితే అందరూ భయపడతారు. ఆమె చేసే పనులు కూడా అలానే ఉంటాయని  శ్యామల అంటుంది. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు ఖాళీగా ఉంది కదా అని దీప అంటే.. ఖాళీగా ఉందని కత్తితో చేయి కోసుకుంటామా? ఇవన్నీ మీకు చెప్పానని తెలిస్తే నేను ఏమైపోతానో ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెబుతుంది.
Also Read: హ..హ.. హాసిని మళ్లీ వచ్చేస్తోంది..
దీప, శ్యామల మాట్లాడుకోవడం చూసిన కార్తీక్ ‘ఏమంటోంది’అని అడుగుతాడు. కొత్తగా కనిపించాం కదా అడుగుతోంది అని దీప అంటే.. సీరియస్‌గా ఏదో చెబుతోంది అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. అదేం లేదంటుంది దీప.  మనం ఈ ఇంటిని శుభ్రం చేద్దాం ఎవరు ఎక్కువగా పనులు, తక్కువగా ప్రశ్నలు వేస్తారో వారికి బహుమతులు ఇస్తాను. మీ డాడీ సీక్రెట్ మార్కులు వేస్తాడు అని పిల్లలతో పని చేయిస్తంది దీప. దీంతో ఈరోజు ఏపిసోడ్ ముగుస్తుంది. 
రేపటి ఎపిసోడ్ లో
రేపటి ఎపిసోడ్‌లో రుద్రాణి దగ్గరకే వెళ్లుంది దీప. ఏదైనా పని ఉంటే ఇస్తారా? అని అడుగుతుంది. నీకు నా గురించి తెలిసే వచ్చావా? ఎవ్వరూ నీకు చెప్పలేదా అని రుద్రాణి భయపెట్టే ప్రయత్నం చేస్తంది. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూడాలి. 
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Dec 2021 08:45 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Karthika Deepam Serial Today Episode 1218 Rudrani 9th December Episode karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Karthika Deepam new Episode 1216 Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్

ఇవి కూడా చూడండి

King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!

Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!

టాప్ స్టోరీస్

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!