Genelia Deshmukh: హ..హ.. హాసిని మళ్లీ వచ్చేస్తోంది..
దాదాపు దశాబ్దం పాటూ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన జెనీలియా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏ సినిమాతో అంటే...

జెనీలియా.. ఈ పేరు వినగానే ‘బొమ్మరిల్లు’లో అల్లరిపిల్ల ‘హాసిని’ గుర్తొస్తుంది. 'అమ్మో ఒక్కసారి గుద్దితే కొమ్ములొస్తాయి', 'బీపీ అంటే ఇలా ఉంటుందా దగ్గర్నుంచి చూడడం ఫస్ట్ టైం' అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్స్ గుర్తొస్తాయి. 'తుఝే మేరీ కసమ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 'బాయ్స్'మూవీతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించింది. సత్యం, సై, రెఢీ, హ్యాపీ, ఆరెంజ్, నా ఇష్టం ఇలా.. దాదాపు పదేళ్లపాటూ వరుస ఆఫర్స్ అందుకున్న జెనీలియా అకౌంట్లో ఎన్నో హిట్ చిత్రాలున్నాయి. కెరీర్ జోరుమీదున్న సమయంలో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లైంది. అయితే సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. ఫ్యాషన్ ఫొటోలు, జిమ్ వర్కౌట్స్ తన ఇన్ స్టా అకౌంట్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే దాదాపు పదేళ్ల బ్రేక్ తర్వాత జెనీలియా రీఎంట్రీ ఇస్తోంది. వేద్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నట్టు ట్వీట్ చేసింది జెన్నీ.
Back to the movies #वेड pic.twitter.com/OB8vQWj1wk
— Genelia Deshmukh (@geneliad) December 8, 2021
ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేముందు తెలుగులో నటించిన ఆరెంజ్, నా ఇష్టం ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జెనీలియా లుక్ లో ఏమాత్రం మార్పులేదు. మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లై, తల్లైనా కరీనా జోరు అస్సలు తగ్గలేదు. మరోవైపు దీపిక, ప్రియాంక కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. మరి జెనీలియా రీఎంట్రీ లోనూ హీరోయిన్ గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం..
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ గురించి ఈ విషయాలు తెలుసా..
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
Also Read: 'RRR' అప్‌డేట్.. భీమ్ వచ్చేశాడు
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















