వాగుడుకాయ, మల్టీ టాలెంటెడ్, యూట్యూబర్, రేడియో జాకీ, వీడియో జాకీ, సింగర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఇన్ని టాలెంట్స్ కాజల్ సొంతం. బిగ్ బాస్ హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానుల మెప్పు పొందుతూ హౌజ్ లో ముందుకు సాగుతోంది.
ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా పరిచయమైన ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఆర్జే కాజల్ విజయవాడ లోనే పుట్టి పెరిగింది. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ కాగా అమ్మ హౌస్ వైఫ్. వీరు ముగ్గురు అమ్మాయిలు..కాజల్ చిన్నమ్మాయి. విజయ్ శీలంశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ కి ఓ కుమార్తె. బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కాజల్ కు రేడియో జాకీ గా అవకాశం రావడంతో వెంటనే ఆ ఆఫర్ అందిపుచ్చుకుంది.
కేవలం ఆర్జే గానే పరిమితం కాకుండా.. పలు ఈవెంట్స్ ను హోస్ట్ చేయడంతో పాపులర్ అయింది కాజల్. 2009 లో “నిన్ను కలిసాక” సినిమా లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. సుమారు 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా మంచు మనోజ్ ,తాప్సీ నటించిన “ఝుమ్మందినాదం” ఓ ఫ్రేమ్ లో కనిపించింది కాజల్.
యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులార్ అయిన కాజల్ హిందీ బిగ్ బాస్ చూస్తూ ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంది. ఎట్టకేలకు ఛాన్స్ రావడంతో సద్వినియోగం చేసుకుంది. తన ఫస్ట్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ నాగ్‌తోనేనని చెప్పుకొచ్చిన కాజల్...వచ్చీ రావడంతోనే నాగార్జునతో ఐలవ్ యూ చెప్పించుకుంది.
టాస్కుల్లో మంచి ప్రదర్శన ఇస్తూ, ఆటపాటలతో బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేస్తోంది కాజల్. అన్నింటా తానుండాలని కోరుకునే కాజల్...బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ నిలవాలని ఆకాంక్షిస్తోంది.
ఆర్జే కాజల్ (Image Credit:RJ Kajal️/Instagram)
ఆర్జే కాజల్ (Image Credit:RJ Kajal️/Instagram)
ఆర్జే కాజల్ (Image Credit:RJ Kajal️/Instagram)
Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
Lavanya Tripathi: హనీమూన్ వెళ్ళడానికి ముందు - రెడ్ శారీలో మెగా కోడలు లావణ్య
Anchor Aanasuya: కన్ను కొట్టిన అనసూయ, ఇక అభిమానులు ఆగుతారా?
Janhvi Kapoor Photos: మరీ అంత ఆలోచించడం ఎందుకు జాన్వీ పాప!
Parvathy Thiruvothu: 'దూత'లో ఎస్పీగా నటించినది ఈ అమ్మాయే - ఈ మాలీవుడ్ బ్యూటీ గురించి తెలుసా?
Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
/body>