X

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

ఈరోజు ఎపిసోడ్ లో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ కి రోల్ ప్లే టాస్క్ ఇచ్చారు. టాస్క్ మొదలవ్వక ముందే షణ్ముఖ్.. సిరితో గొడవ పెట్టుకున్నాడు. 

FOLLOW US: 
నిన్నటినుంచి బిగ్ బాస్ హౌస్ లో రోల్ ప్లే టాస్క్ నడుస్తోంది. హౌస్ లో జరిగిన కొన్ని హైలైట్ సంఘటనలకు కంటెస్టెంట్స్ కి ఇచ్చి.. వేరే ఇంటి సభ్యుల్లా నటించమని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో.. వారు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకుంటారని చెప్పారు. నిన్న సిరి-సన్నీ అప్పడం టాస్క్ తో పాటు.. ప్రియాంక-మానస్ ల జర్నీ టాస్క్ ను ఇవ్వగా.. హౌస్ మేట్స్ వారి వారి పాత్రల్లో జీవించేశారు. ఈరోజు కూడా ఈ రోల్ ప్లే టాస్క్ కంటిన్యూ అవ్వనుంది.
 
ముందుగా మానస్-కాజల్ డిస్కషన్ పెట్టుకున్నారు. సిరిని షణ్ముఖ్ బాగా కంట్రోల్ చేస్తున్నాడని.. దానివలన సిరి తన ఇండివిడ్యుయాలిటీని కోల్పోతుందని మానస్ అన్నాడు. సర్వైవల్ కోసం అలా చేస్తుందేమో అని అనగా.. తనకు అలా అనిపించడం లేదని జెన్యూన్ గానే సిరి.. షణ్ముఖ్ ని ఇష్టపడుతుందని కాజల్ కామెంట్స్ చేసింది. 
 
సన్నీతో షణ్ముఖ్ ఫైట్..: ఇక తెల్లవారు జామున హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ 'జెస్సీ పిండి ఫైట్' సంఘటనను రోల్ ప్లేగా ఇచ్చారు. దీంతో హౌస్ మేట్స్ ఆరోజు ఏం జరిగిందో గుర్తుచేసుకుంటూ డిస్కషన్ పెట్టుకున్నారు. అదే సమయంలో సన్నీ.. షణ్ముఖ్ ని ఇమిటేట్ చేస్తూ ఎలా బిహేవ్ చేశాడో చెప్పాడు. దీంతో షణ్ముఖ్ సీరియస్ అయ్యాడు. 'ఎక్కిరిస్తున్నావ్.. నాకు నచ్చదని చెప్పినా అదే చేస్తున్నావ్..' అని అన్నాడు షణ్ముఖ్. దానికి సన్నీ.. 'ప్రతీది సీరియస్ గా తీసుకోకు షణ్ముఖ్.. ఇలా ఏదీ తీసుకోకపోతే ప్రపంచంలో చాలా ఇబ్బంది పడతావ్ గుర్తుపెట్టుకో..' అని డైలాగ్ వేశాడు. 'అయినా నేను ఇలానే ఉంటానని' షణ్ముఖ్ అన్నాడు. ఈ విషయంలో సన్నీ-షణ్ముఖ్ కాసేపు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. 'ఎంత కనెక్ట్ అవుదామని చూస్తున్నా.. ఆయన క్యారీ చేస్తూనే ఉన్నాడు' అని సన్నీ తన ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాడు. 
 
కోపంలో ఉన్న షణ్ముఖ్ ని కంట్రోల్ చేద్దామని మాట్లాడడానికి వెళ్లింది సిరి. గేమ్ ఆడదామని షణ్ముఖ్ ని పిలవగా.. 'నేను చేయను.. నాకు ఇమిటేషన్ నచ్చదు.. నన్ను దొబ్బకు.. మీకు లిమిటేషన్స్ ఉంటాయి.. అవి దాటకూడదు. కానీ మీరు నా విషయంలో ఎన్నైనా క్రాస్ చేయొచ్చు' అంటూ సిరిపై ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. వెంటనే ఆమె 'ఆయనే(బిగ్ బాస్) చెప్తాడు ఫైనల్ గా అప్పుడు నువ్వే చేస్తావ్' అనుకుంటూ లోపలకి వెళ్లిపోయింది. 'ఫ్లోలో వచ్చేసింది బ్రో.. తన ఇంటెన్షన్ అది కాదు.. ఆర్టిస్ట్ కి ఆ ఫ్లో ఉంటాది' అని మానస్.. షణ్ముఖ్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. 'సన్నీ చేసే ఇమిటేషన్ జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు.. కానీ నాకు నచ్చదు అంతే' అని చెప్పాడు. 
 
సిరిని ఇష్టమొచ్చినట్లు తిట్టేసిన షణ్ముఖ్..: ఆ తరువాత సిరి, మానస్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. 'ప్రతీదీ నెగెటివ్ గా చూస్తున్నావ్.. సిరి అంటేనే నీకు నెగెటివ్' అని సిరి అనగా.. 'నువ్ చెప్పేది నెగెటివే.. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్..' అంటూ అరిచాడు షణ్ముఖ్. 'నువ్ ఎవరికో ఎమోషనల్ కనెక్ట్ అయితే నేను ఆపాను. నిన్ను ఎవడో అప్పడం అంటే నేను నిన్ను డిఫెండ్ చేశాను. మీ మదర్ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడారు. నేను నెగెటివ్ అవ్వట్లేదు ఇక్కడ.. నీ మంచి గురించి నేను చేస్తుంటే నేను నెగెటివ్ మాట్లాడుతున్నాను అంటున్నావ్. మిగతా హౌస్ మేట్స్ ఎలాగో నువ్ కూడా అంటే నాకు ఇప్పుడు. నీ కాలికి దెబ్బ తగిలితే నేను చూసుకున్నాను. అది నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్. నేను వంద సార్లు చెప్పుకోను. ఇందుకే జెస్సీ మీద నాకు రెస్పెక్ట్. నీకంటే వాడే ఎక్కువ. చాలా ఫ్రీడమ్ తీసుకున్నావ్ నా విషయంలో.. అవతలి వాళ్లను రెస్పెక్ట్ చేస్తావ్, నన్ను అరేయ్.. ఒరేయ్.. అని నీ ఇష్టమొచ్చినట్లు అంటావ్. మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వవు. అవతలి వాడికి తక్కువైపోతున్నా.. నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు. హగ్ ఒక్కటే గుర్తుంది. అప్పుడు నేను నెగెటివ్ అవ్వలేదు' గట్టిగా గట్టిగా అరుస్తూ సిరికి క్లాస్ పీకాడు షణ్ముఖ్.
 
షణ్ముఖ్ అరుపులు విని మానస్, సన్నీ షాకయ్యారు. అలా అరుస్తున్నాడేంటి..? అనుకుంటూ మాట్లాడుకున్నారు. 'ఎలా అరుస్తున్నాడు అసలు.. నాకు అసలు నచ్చలేదు. సిరి తరఫున మాట్లాడాలనిపించింది' అని కాజల్.. శ్రీరామ్ తో చెప్పింది. 
 
సిరి-షణ్ముఖ్ హగ్గులు: 'నేనేమైనా అడిగానా నాకు వెయిట్ ఇవ్వమని..? నేను అడిగానా నెత్తిన పెట్టుకోమని..?' అంటూ తనలో తనే ఏడ్చుకుంటూ మాట్లాడుకుంది సిరి. ఎప్పటిలానే సిరిని వెతుక్కుంటూ వచ్చిన షణ్ముఖ్ 'వేరే కోపం నీ మీద చూపించాను.. సారీ' అని చెప్పాడు. దానికి ఆమె కరిగిపోయి హగ్ ఇచ్చింది.  
 
ఇక బిగ్ బాస్ ఇచ్చిన జెస్సీ పిండి గొడవ రోల్ ప్లేలో షణ్ముఖ్.. శ్రీరామ్ క్యారెక్టర్ పోషించగా.. సిరి.. జెస్సీ రోల్ ప్లే చేసింది. కాజల్.. సిరి క్యారెక్టర్ తీసుకుంది. శ్రీరామ్.. షణ్ముఖ్ పాత్ర పోషించాడు. సన్నీ మాత్రం లాంగ్ ఫ్రాక్ వేసుకొని హమీద పాత్రలో కనిపించాడు. ఈ టాస్క్ లో సిరి, షణ్ముఖ్, శ్రీరామ్ డైలాగ్స్ చెబుతూ అప్పటి సీన్ ను రిపీట్ చేస్తుండగా.. హమీద గెటప్ లో ఉన్న సన్నీ.. 'అరే ఎందుకు ఒకడిమీద ఇలా పడిపోతారు' అంటూ హమీదను ఫన్నీగా ఇమిటేట్ చేసి నవ్వించాడు. ఫైనల్ గా షణ్ముఖ్.. శ్రీరామ్ ని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం నవ్విస్తుంది.  
 
మోస్ట్ ఎంటర్టైనర్ గా షణ్ముఖ్: ఈ రోల్ ప్లే టాస్క్ మొత్తంలో మోస్ట్ ఎంటర్టైనింగ్ పెర్సన్ గా షణ్ముఖ్ కి ఎక్కువ వోట్లు పడ్డాయి. దీంతో అతడ్ని గార్డెన్ ఏరియాలో ఉన్న వోటింగ్ కార్నర్ లో వోట్ అప్పీల్ ను మొదలుపెట్టమని చెప్పారు బిగ్ బాస్. వెంటనే షణ్ముఖ్ బీబీ5 వోట్ ఫర్ మీ స్టేజ్ పై నుంచొని ప్రేక్షకులను సపోర్ట్ చేయమని అడిగారు. తనతో పాటు హౌస్ మేట్స్ కి కూడా ఓట్లు వేయమని కోరాడు. 
 
ఆ తరువాత హౌస్ మేట్స్ తో లాఫింగ్ గేమ్ ఆడించారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఉన్న హాట్ సీట్ పై ఒక్కో కంటెస్టెంట్ కూర్చోవాలని.. వాళ్లని మిగిలిన హౌస్ మేట్స్ నవ్వించడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఎవరు తక్కువ సార్లు నవ్వుతారో వాళ్లకు వోట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వస్తుందని చెప్పారు. ముందుగా షణ్ముఖ్ హాట్ సీట్ లో కూర్చోగా.. కాజల్, సన్నీ అతడిని బాగా నవ్వించారు. ఆ తరువాత కాజల్, సిరి, సన్నీ కూడా హాట్ సీట్ లో కూర్చొని బాగా నవ్వేశారు. మానస్, శ్రీరామ్ మాత్రం తమ నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు. 

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh Siri Sunny Bigg Boss 5 Telugu 95 Episode Highlights

సంబంధిత కథనాలు

Big Boss Sunny & Anee Master: యానీ మాస్ట‌ర్‌కు కొవిడ్‌... స‌న్నీకి స‌పోర్ట్ చేయ‌నందుకు వ‌చ్చింద‌ని శాప‌నార్థాలు!

Big Boss Sunny & Anee Master: యానీ మాస్ట‌ర్‌కు కొవిడ్‌... స‌న్నీకి స‌పోర్ట్ చేయ‌నందుకు వ‌చ్చింద‌ని శాప‌నార్థాలు!

Deepthi Sunaina: హీరోయిన్‌గా దీప్తీ సునయిన‌... ఆమె రియాక్ష‌న్ ఏంటంటే?

Deepthi Sunaina: హీరోయిన్‌గా దీప్తీ సునయిన‌... ఆమె రియాక్ష‌న్ ఏంటంటే?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Manushi Chhillar: చిల్ అవుతోన్న మానుషి చిల్లర్

Manushi Chhillar: చిల్ అవుతోన్న మానుషి చిల్లర్