అన్వేషించండి
Advertisement
Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..
మహేష్ బాబుకి సంబంధించిన ప్రెస్టీజియస్ బ్రాండ్ విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించిన ఆయన 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకాకముందే విజయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. ఓ పక్క సినిమా షూటింగ్స్ తో ఎంతబిజీగా ఉన్నా.. కమర్షియల్ యాడ్స్ కోసం కూడా సమయం కేటాయిస్తుంటారు.
నేషనల్ లెవెల్ లో బ్రాండ్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ. మహేష్ బాబు తరువాత తెలుగులో ఎక్కువ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ.. ఆ రేంజ్ లో డబ్బు సంపాదిస్తోంది విజయ్ అనే చెప్పాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు మహేష్ బాబుకి సంబంధించిన ప్రెస్టీజియస్ బ్రాండ్ విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
చాలా ఏళ్లుగా మహేష్ బాబు 'థంబ్సప్' యాడ్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణవీర్ కపూర్, మహేష్ బాబుపై ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఇంకా టీవీల్లో ఈ యాడ్ వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మహేష్ బాబుకి బదులుగా విజయ్ దేవరకొండ ఈ యాడ్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇంతకముందు మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ లో నటించేవారు. ఆ తరువాత మహేష్ థంబ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇప్పుడేమో విజయ్ చేతులోకి ఈ బ్రాండ్ వచ్చింది.
Then Super Star @urstrulyMahesh
— VB (@Mr_ViolentBoy) December 8, 2021
Now Fan Boy @TheDeverakonda #VijayDeverakonda For #ThumbsUp Advertisement 🔥🔥#LIGER pic.twitter.com/fBvW4VS5M2
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement