By: ABP Desam | Updated at : 16 Feb 2023 09:35 AM (IST)
సింగర్ సునీత
తెలుగు ప్రేక్షకులలో సింగర్ సునీత (Singer Sunitha) కు అగ్ర కథానాయికలతో సమానమైన ఫాలోయింగ్ ఉంది. కొందరు హీరోయిన్ల కంటే సోషల్ మీడియాలో ఆమెకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సునీత గాత్రానికి మాత్రమే కాదు... ఆమె రూపానికి కూడా అభిమానులు ఉన్నారు. అందువల్ల, సునీత వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ ఉంది. ఆమె వ్యక్తిగత జీవితంపై పుకార్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.
సునీత ప్రెగ్నెంట్!?
Sunitha On Her Pregnancy : సునీత ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ఆ నోటా ఈ నోటా సునీత వరకు వెళ్ళింది. దాంతో ఆమె స్పందించారు. ''నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకే తెలీదు. ఇటువంటి పుకార్లను పుట్టిస్తున్నారంటే... వాళ్ళ ఆలోచనా విధానం ఎలా ఉందో? అది వాళ్ళకే వదిలేస్తున్నాను. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. నా జీవితాన్ని కూడా!'' అని సునీత పేర్కొన్నారు.
సునీత ప్రెగ్నెన్సీ... ఇది రెండోసారి!సునీత తల్లి కాబోతున్నారనే ప్రచారం కొత్తది ఏమీ కాదు. గత ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఇటువంటి పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆవిడ 'బ్లెస్సెడ్' అంటూ ఒక పోస్ట్ చేశారు. అందులో రెండు ఫొటోలు ఉన్నాయి. మామిడి చెట్టు కింద దిగిన ఫోటో ఒకటి ఉంది. ఇంకో ఫోటో వేరే చెట్టు దగ్గర ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ పులుపు తినడానికి మొగ్గు చూపుతారని, మామిడి కాయలతో ఫొటో దిగడంతో సునీత ప్రెగ్నెంట్ అనే ప్రచారం మొదలైంది. ఆఫ్ కోర్స్... తర్వాత ఆమె ఖండించారు అనుకోండి!
సాధారణంగా ప్రకృతి ఒడిలో టైమ్ స్పెండ్ చేయడం అంటే సునీతకు ఇష్టం. తరచూ మొక్కల మధ్యలో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే, మామిడి చెట్టు దగ్గర ఫొటోలు కూడా దిగి ఉండొచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నారా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు.
మ్యాంగో మూవీస్ అధినేత, ప్రముఖ సెలబ్రిటీ రామ్ వీరపనేని, సునీత జనవరి 10, 2021లో వివాహం జరిగింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటుందీ జంట. రామ్ వీరపనేనితో కంటే ముందు సునీతకు మరో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి పేరు ఆకాష్, అమ్మాయి పేరు శ్రేయ.
సునీత కుమారుడు త్వరలో తెలుగు తెరకు హీరోగా పరిచయం కానున్నారు. 'నౌకరీ' అని ఓ సినిమా చేస్తున్నారు. ఈ మధ్య పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. దానికి రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. సునీత అమ్మాయి గాయనిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయితో దిగిన ఫోటోలను సునీత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
రామ్ - సునీత దంపతులకు పిల్లలు లేరు. అయితే, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నారని అప్పుడప్పుడూ పుకార్లు వస్తుంటాయి. పుకార్లను పట్టించుకోకుండా సునీత జీవితంలో ముందుకు వెళుతున్నారు. ఇటీవల ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అభిమానులతో కలిసి ముచ్చటించారు. ఆ వీడియో కూడా అందులో పోస్ట్ చేశారు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు బుల్లితెరపై సింగింగ్ రియాలిటీ షో 'పాడుతా తీయగా'లో కూడా సందడి చేస్తున్నారు.
Also Read : రాజకీయాల్లోకి కిచ్చా సుదీప్ - పార్టీల నుంచి పిలుపు నిజమే
Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్లో సరికొత్త రికార్డు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?