Sharwanand: నన్ను మోసం చేస్తే సహించలేను - నిర్మాతపై శర్వానంద్ కామెంట్స్!
'ఒకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా పాల్గొంటున్నారు శర్వానంద్.
శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సినిమాలో పాటలు కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి.
సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా పాల్గొంటున్నారు శర్వానంద్. రీసెంట్ గా ఓఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వివాదాలకు దూరంగా ఉండే ఈ యంగ్ హీరో ఓ నిర్మాతపై ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు శర్వానంద్.. టాలీవుడ్ నిర్మాతపై ఎందుకు ఆరోపణలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం!
కొన్ని రోజులుగా ఓ నిర్మాత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సినిమా రెమ్యునరేషన్ తగ్గించుకోనని, నిర్మొహమాటంగా మాట్లాడతానని చెబుతున్నారని అన్నారు శర్వానంద్. అసలు రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలని ప్రశ్నించారు. తన మార్కెట్ ను బట్టి నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అది అని.. దాన్ని ఇంకా తగ్గించుకోవాలని చెబుతున్నారని శర్వానంద్ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ''మనకు ఆస్తి ఉంది. ఎందుకు ఈ కష్టాలు అని నా తల్లితండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. నీ కాళ్ల మీద నువ్వు ఎదగాలని చెప్పే పెంచారు. 19 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నానని. వాళ్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ నిర్మాత మాత్రం నన్ను మోసం చేశాడు. అతడు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. అయినా నేను సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వల్ల ఆయనకు ఎంత లాభం వచ్చిందో కూడా నాకు తెలుసు. నన్ను మోసం చేస్తే సహించలేను'' అంటూ చెప్పుకొచ్చారు.
శర్వా సినిమాలో కార్తీ పాట:
ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిన్నపిల్లలంతా కలిసి కోరస్ పాడుతుంటారు. లీడ్ సింగర్ ఎవరని చర్చకి రాగా.. ఓ స్టార్ హీరో అని చెబుతారు. దీంతో వారంతా ఎవరై ఉంటారా..? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి ముందు బకెట్ తో బిరియాని తీసుకొచ్చి పెడతారు. సింబాలిక్ గా హీరో కార్తీ అని చెప్పకనే చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ లో 'ఖైదీ' మ్యూజిక్ కూడా వినిపించింది.
అంటే శర్వానంద్ కోసం కార్తీ పాట పాడడానికి రెడీ అయ్యారన్నమాట. ఇదివరకు కూడా కార్తీ పాటలు పాడారు. తమిళంలో ఆయన నటించిన 'శకుని', 'బిరియాని' సినిమాల్లో సాంగ్స్ పాడారు కార్తీ. ఇప్పుడు వేరే హీరో సినిమాలో పాడబోతున్నారు.
'ఒకే ఒక జీవితం' సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్