Liger Boycott Controversy : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్
విజయ్ దేవరకొండ ప్రవర్తన సరిగా లేదంటూ ముంబైలోని మరాఠా మందిర్ సినిమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైర్ అయ్యారు. అతడు అనకొండలా మాట్లాడుతున్నాడని, ఇలా ఉంటే ఓటీటీలో కూడా అతని సినిమాలు ఎవరూ చూడరని అన్నారు.
'లైగర్' (Liger Movie) పరాజయం కంటే ఆ సినిమా పరాజయానికి గల కారణాలు ఏంటి? అనే అంశం చుట్టూ ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్ కథ, కథనం, దర్శకత్వంపై కొందరు విమర్శలు చేస్తుంటే... మరికొందరు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రవర్తనపై విమర్శలు చేస్తున్నారు. 'లైగర్' విడుదలకు ముందు రౌడీ బాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
'లైగర్'ను బాయ్‌కాట్ చేయాలంటూ ఉత్తరాది ప్రేక్షకులలో కొంత మంది ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. అప్పుడు ''ఎవరు ఆపుతారో చూద్దాం'' అంటూ ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై ముంబైలో జైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ మండిపడ్డారు. విజయ్ దేవరకొండను అహంకారిగా ఆయన అభివర్ణించారు.
చూడొద్దని చెబితే ప్రేక్షకులు చూడరు!
''మిస్టర్ విజయ్ దేవరకొండ... నువ్వు అహంకారంగా మారిపోయావు. 'సినిమా చూడండి. మీకు చూడకూడదని అనిపిస్తే మానేయండి' అంటే ఎలా? ఒకవేళ ప్రేక్షకులు చూడకపోతే... తాప్సీ పన్ను పరిస్థితి ఏమైంది? ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమాలకు ఏమైంది? నువ్వు ఓటీటీ ప్రాజెక్టులు ఎందుకు చేయవు? థియేటర్లు వదిలేసి తెలుగు, తమిళంలో సీరియళ్లు, ఓటీటీ ప్రాజెక్టులు చెయ్. మా సినిమా బాయ్ కాట్ చేయమని ఎందుకు అంటున్నావ్? తెలివితేటలు చూపించకు. అప్పుడు ఓటీటీల్లో కూడా నీ సినిమాలు ఎవరూ చూడరు'' అని ముంబైలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ దేశాయ్ మండిపడ్డారు (Mumbai Theatre Owner Fires On Vijay Devarakonda).
విజయ్ దేవరకొండ కాదు... అనకొండ!
దేవరకొండ కాదు... అనకొండ, అనకొండలా మాట్లాడుతున్నాడని మనోజ్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ప్రవర్తన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పుడు అదే జరుగుతుందని మనోజ్ దేశాయ్ అన్నారు. తాప్సీ పన్ను చేసిన విధంగా విజయ్ దేవరకొండ చేస్తున్నాడని, తమకు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని, అయితే ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు బుకింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించాయని మనోజ్ దేశాయ్ తెలిపారు.
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఒక ప్రెస్ మీట్ జరిగితే... అప్పుడు టేబుల్ మీద విజయ్ దేవరకొండ కాళ్ళు పెట్టడం కూడా ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది. 'మా అయ్యా ఎవడో తెల్వదు, మా తాత ఎవరో తెల్వదు' అని కామెంట్ చేయడం కూడా 'లైగర్' సినిమా బుకింగ్స్ మీద డ్యామేజ్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు (Reasons For Liger Movie Flop Talk). సినిమా విడుదల తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ... తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రానికి గానీ ఆ వసూళ్లు ఎంత అనేది క్లారిటీ రాదు.
Also Read : ఐదేళ్ల తర్వాత ‘అర్జున్ రెడ్డి’ డిలీటెడ్ సీన్ రిలీజ్, రౌడీ బాయ్ ఫ్యాన్స్‌కు ఓదార్పు!