Shanmukh Jaswanth - Deepthi Sunaina: లవ్ ఫెయిల్యూర్‌నూ క్యాష్ చేసుకుంటున్న షణ్ముఖ్ జస్వంత్!
షణ్ముఖ్ జస్వంత్ లవ్ ఫెయిల్యూర్‌నూ క్యాష్ చేసుకుంటున్నాడా? కొంత మంది ఫీలింగ్ ఇదే. కానీ, అతడి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే...
'బిగ్ బాస్' హౌస్‌కు వెళ్ళడం వల్ల యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌కు మంచి కంటే చెడు ఎక్కువ జరిగిందనేది చాలా మంది అభిప్రాయం. 'బిగ్ బాస్'కు వెళ్లి వచ్చిన తర్వాత అతడికి దీప్తీ సునయన బ్రేకప్ చెప్పింది. అందుకు కారణం హౌస్‌లో సిరి హనుమంతుతో అతడు ప్రవర్తించిన విధానం అనేది బయట వినిపించే మాట. అది పక్కన పెడితే... లవ్ ఫెయిల్యూర్‌నూ షణ్ముఖ్ జస్వంత్ క్యాష్ చేసుకుంటున్నట్టు ఉన్నాడని నెటిజన్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా స్టార్ మా ఛానల్ 'బిగ్ బాస్ జోడీ ఈవెంట్' అని ఒక కార్యక్రమం చేసింది. అందులో 'ఆర్య 2'లోని 'మై లవ్ ఈజ్ గాన్' పాటకు షణ్ముఖ్ జస్వంత్ పెర్ఫార్మన్స్ చేశారు. 'పోయే పోయే లడకీ పోయే...' అంటూ అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను మరోసారి వేశారు. ఈ పాటకు షణ్ముఖ్ ఎందుకు డాన్స్ చేశారు? అతడిని వదిలి ఎవరు పోయారో? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ ఫెయిల్యూర్‌ను అతను పెర్ఫార్మన్స్ కోసం వాడుకున్నాడని, లవ్ ఫెయిల్యూర్‌నూ క్యాష్ చేసుకున్నాడనేది కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ, మెజారిటీ వీక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు అతడిలో బాధ కనిపిస్తుంది.
దీప్తీ సునయనకు షణ్ముఖ్ ఇంకా బ్రేకప్ చెప్పలేదు. మళ్ళీ ఆమె తన దగ్గరకు వస్తుందని, ఆమెకు తాను దగ్గర అవుతానని బలంగా నమ్ముతున్నట్టు ఉన్నాడు. 'లవ్ ఈజ్ గాన్. డు యు బిలీవ్ ఇన్ లవ్?' (ప్రేయసి వెళ్లిపోయిందని అన్నావ్. నువ్ ప్రేమను నమ్ముతావా?' అని యాంకర్ రవి అడిగితే... షణ్ముఖ్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. తర్వాత 'లవ్ అనే ఎమోషన్ లో ఒక సారీ, ఒక థాంక్స్, ఒక బై ఎవరికి చెప్తావ్?' అని మరోసారి రవి అడిగితే... పైకి నవ్వుతున్నట్టు ఉన్నప్పటికీ, లోపల ఎంతో బాధ ఉన్నట్టు మరో ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దీప్తి సునయన గురించి టీవీ వేదికగా షణ్ముఖ్ జస్వంత్ ఏదో ఒకటి చెప్పడం ఖాయం అని అనిపిస్తోంది. లవర్స్ డేకి ముందు రోజు... ఫిబ్రవరి 13న సాయంత్రం ఆరు గంటల నుంచి టెలికాస్ట్ అయ్యే 'బిగ్ బాస్ జోడీ ఈవెంట్'కు షణ్ముఖ్ పెర్ఫార్మన్స్ క్రేజ్ తెచ్చింది. యూట్యూబ్ ప్రోమో కోసం అతడికి మద్దతుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram