అన్వేషించండి

Dil Raju On Shankar Movie: పవన్ కళ్యాణ్ వద్దని శంకర్‌కు చెప్పా, ఒక్కో పాటకు రూ.12 కోట్లు ఖర్చు: దిల్ రాజు

దిల్ రాజు నిర్మాతగా శంకర్, చెర్రీ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న వేళ, దిల్ రాజు ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. 70 శాతానికి పైగా సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే వాడినని చెప్పారు. అందుకే అప్పట్లు చాలా క్వాలిటీ సినిమాలు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు ఒకేసారి పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలా చేయడం వల్ల క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అందుకే అలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ బాధ్యతలను తన కూతురు హన్సితారెడ్డి, మేనల్లుడు హరీష్ రెడ్డి చూసుకుంటారని రాజు తెలిపారు. వర్క్‌ని వైవిధ్యపరచడానికి  రెండు వేర్వేరు బ్యానర్‌లపై సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.  

ఆయన పవన్ కళ్యాణ్ అన్నారు, నేను రామ్ చరణ్ ను ఓకే చేశా - దిల్ రాజు

ఇక పాన్ ఇండియన్ సినిమాలు చేయాలనే కుతూహలంతోనే శంకర్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “పాన్ ఇండియా సినిమా చేయాలనే ఎగ్జైట్ మెంట్ తో శంకర్ సినిమా చేయడం లేదు. శంకర్, నేను ‘ఇండియన్ 2’ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాను. ‘ఇండియన్ 2’ సినిమా మధ్యలో బ్రేక్ వచ్చింది. కమల్ హాసన్ వేరే సినిమా చేశారు. అప్పుడు శంకర్ మేనేజర్ దగ్గర నుంచి నాకు ఓ కాల్ వచ్చింది. ఓ మంచి కథ ఉంది అని చెప్పారు. నేను కథ విన్నాను. 45 నిమిషాల పాటు స్టోరీ నేరేషన్ చేశారు.. నచ్చింది. హీరో ఎవరు అనుకుంటున్నారు అని అడిగాను. అతను పవన్ కళ్యాణ్ లాంటి వారు అయితే బాగుటుంది అని చెప్పారు. అప్పుడు నేను రామ్ చరణ్‌ని సూచించాను. ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పాను” అన్నారు.

ఒక్కో పాటకు రూ. 12 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు - దిల్ రాజు

వాస్తవానికి ఆ సమయంలో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో ఉన్నట్లు దిల్ రాజు తెలిపారు. “రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్లాను. చరణ్ తో మాట్లాడాను. ఓ కథ విన్నాను బాగుంది అని చెప్పాను. ఆ తర్వాత శంకర్‌తో చరణ్ కు ఫోన్ ద్వారా కథ చెప్పించాను. నేను పక్కనే ఉన్నాను. ఫోన్ లో చెప్పాక, నేను చరణ్ మళ్లీ డిస్కస్ చేసుకున్నాం. చరణ్‌కు స్టోరీ నచ్చింది. ప్రాజెక్ట్ లాక్ అని చెప్పాను. అది నా 50వ సినిమా. అప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాలేదు. ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఒక్కో పాటకు 10 నుంచి 12 కోట్లు ఖర్చు పెట్టించారు శంకర్. ఐదు పాటలను 5 రకాలుగా షూట్ చేశారు. సినిమా 70 శాతం అయిపోయింది. మళ్లీ ‘ఇండియన్ 2’ తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు 10 రోజులు, ఈ సినిమాకు 10 రోజులు సమయం కేటాయిస్తున్నారు. సెప్టెంబర్ లో రామ్ చరణ్, శంకర్ మూవీ కంప్లీట్ అవుతుంది“ అని దిల్ రాజు తెలిపారు.

Read Also: రేపు నా బర్త్ డే, ఎవరూ విష్ చేయకండి - ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Miss Apoorva: బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్.. మోడలింగ్ నుంచి గ్లామర్ హౌస్ వరకు!
బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget