Serial Actress Lahari: యాక్సిడెంట్ కేసులో అరెస్టైన సీరియల్ నటి లహరి
తెలుగు సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన నటి లహరి యాక్సిడెంట్ కేసులో చిక్కుకుంది.

పలు తెలుగు సీరియళ్లలో హీరోయిన్‌గా నటించిన లహరి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయ్యింది. ఆమె కారులో శంషాబాద్ నుంచి వస్తూ ఎదురుగా వస్తున్న ఓ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆ వ్యక్తి రక్తమోడుతున్నా కూడా కనీసం లహరి కారులోంచి దిగలేదు. దీంతో స్థానికులంతా ఆమెపై మండిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కారుతో సహా స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మద్యం తాగి?
లహరి మద్యం తాగి వాహనం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. కాగా లహరి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి అని తెలుస్తోంది. డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో లహరి కారుతో ఢీ కొట్టింది. ఆ వ్యక్తి కిందపడి గాయాలపాలైనా కూడా, నటి కనీసం కారు దిగకపోవడం మిగతా వాహనదారులకు చాలా కోపం తెప్పించింది. ఆమెతో వారు వాగ్వాదానికి దిగారు. చివరికి శంషాబాద్ పోలీసులు రంగ్రప్రవేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లహరి చాలా సీరియల్స్ నటించింది. ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తోంది.
Read Also: ఆ పాపులర్ షోను ‘సుధీర్ టీమ్’వదిలేస్తోందా? లేక జనాలను ఫూల్స్ చేసే స్టంటా?
Read Also: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
Read Also: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

