BiggBoss5: ఒక్క ముద్దు పెట్టు సిరి, నువ్వు సింగిల్ అయితేనా... షన్నూ సెన్సార్ ఎక్స్‌ప్రెషన్స్
బిగ్‌బాస్ మరో రెండు వారాల్లో ముగిసిపోతుంది. టాప్ 6 కంటెస్టెంట్స్ తో హౌస్ సరదా టాస్కులతో సాగుతోంది.
బిగ్ బాస్ 5 తెలుగు ప్రోమో ఈసారి నవ్వుల్లో ముంచెత్తేలా ఉంది. బిగ్‌బాస్ రోల్ ప్లే టాస్క్ ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. అందులో భాగంగా కంటెస్టెంట్స్ వేరే సభ్యుల్లా నటించడం మొదలుపెట్టారు. మానస్ క్యారెక్టర్‌ను సన్నీ నటిస్తుండగా, మానస్ ప్రియాంకలా మేకప్ వేసుకున్నాడు. ఇక కాజల్ సన్నీలా, శ్రీరామ చంద్ర సిరిలా, షన్ను జెస్సీలా, సిరి శ్రీరామచంద్రలా క్యారెక్టర్లు మార్చుకున్నారు. వారి పాత్రలకు తగ్గట్టే డ్రెస్సింగ్ మార్చుకున్నారు. అందరికన్నా మానస్ గురించే చెప్పుకోవాలి. ప్రియాంకలా కనిపించడానికి లంగావోణీలో, ముఖానికి మేకప్, విగ్‌తో రెడీ అయ్యాడు. ప్రియాంకను గుర్తుతెచ్చేలా చాలా చక్కగా నటించాడు.
నవ్వులు పువ్వులు...
శ్రీరామ చంద్ర మొదట లోబోలా నటించాడు. అతను అరిచినట్టే ‘ఐ హేట్ జనాలు’ అంటూ గట్టిగా అరిచి నవ్వించాడు. లోబోను అందరికీ గుర్తు చేశాడు. ఇక మానస్ గా నటిస్తున్న సన్నీ, ప్రియాంక క్యారెక్టర్ చేస్తున్న మానస్ తో ప్రేమగా మాట్లాడుతూ నువ్వు ఇంత అందంగా ఉంటావ్ అనుకోలేదు అంటూ ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టాడు. మానస్ ప్రపోజ్ చేస్తాడంటా అనగానే ప్రియాంకలా నటిస్తున్న మానస్ అవునా అంటూ పరుగెత్తుకెళ్లి ‘నాకు నడుము నొప్పి వస్తోంది’అని బెడ్ మీద పడుకుండిపోతుంది. కొన్ని సీన్లు మానస్-ప్రియాంక మధ్య జరిగిన సంఘటనలను రీ కన్‌స్ట్రక్ట్ చేశారు. అవి చాలా నవ్వుతెప్పించేలా ఉన్నాయి.
ముద్దు అడిగిన షన్ను
అన్నింటి కన్నా హైలైట్ షన్ను వేసిన డైలాగులు. షన్ను జెస్సీ క్యారెక్టర్ చేస్తున్నాడు. శ్రీరామచంద్ర మధ్యలో లోబో పాత్రను వదిలి సిరిలా మారాడు. షన్ను తలనొక్కుతున్న శ్రీరామ్ ను ఉద్దేశించి ‘ఒక్క ముద్దు పెట్టు సిరి’అనగానే శ్రీరామ్ చేయి అడ్డంపెట్టి ముద్దుపెట్టేశాడు. ఆ తరువాత షన్ను ‘నువ్వు సింగిల్ అయితేనా’ అంటూ ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. దానికి అందరూ నవ్వేశారు. చివరిలో మానస్-సన్నీల మధ్య జరిగిన సంభాషణ మరింత ఫన్నీగా ఉంది. మొత్తమ్మీద నేటి ప్రోమో చూస్తుంటే ఎపిసోడంతా నవ్వులు పూసేట్టు కనిపిస్తోంది.
Roleplay lo miku baaga perform chesina housemates evaru?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/AJkFflFBUN
— starmaa (@StarMaa) December 7, 2021
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి