Publicity Designer Eshwar: టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇకలేరు.. 4 దశాబ్దాలుగా సినీ రంగానికి ఎనలేని సేవలు
సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలు ఈశ్వర్, చిత్ర పరిశ్రమకు సేవలందించారు.

నాలుగు దశాబ్దాలు చిత్రపరిశ్రమకు సేవలందించిన సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం. బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. 'దేవుళ్ళు' ఆయన పని చేసిన ఆఖరి చిత్రం.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఈశ్వర్‌కు చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం అంటే ఆసక్తి. స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలోనే అందరి మన్ననలు పొందారు. బొమ్మలు గీయాలనే ఆసక్తితో కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో చదువును మధ్యలోనే ఆపేసి.. స్నేహితుడి సాయంతో మద్రాస్ వెళ్లి పబ్లిసిటీ ఆర్టిస్టుగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్‌లో మెళకువలు నేర్చుకుని ‘ఈశ్వర్’ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు. బాపు తెరకెక్కించిన ‘సాక్షి’తో తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన పబ్లిసిటీ పనులు ప్రారంభించారు. ‘సాక్షి’ సినిమా కలర్ పోస్టర్లు, లోగోను ఆయనే రూపొందించారు. బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్‌తో ‘పాప కోసం’ చిత్ర పోస్టర్ల రూపకల్పన చేశారు. హిందీ, తమిళ వెర్షన్లకు అదేరకం పోస్టర్ల రూపకల్పనతో గుర్తింపు పొందారు.
Alos Read: కాలేజీలో గ్యాంగ్ వార్, ఈ పిల్ల నాదంటూ గొడవలు..’గల్లీబాయ్స్’ టీజర్ దుమ్ములేపిందన్న అనిల్ రావిపూడి
ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .
Also Read: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగింపు
Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

