Sharada Death Rumours: నటి శారద మరణించారంటూ ఫేక్ న్యూస్.. స్పందించిన సీనియర్ నటి..
సౌత్ లో పలు భాషల్లో నటించిన ‘ఊర్వశి’ శారద తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించున్నారు.
సౌత్ లో పలు భాషల్లో నటించిన శారద(Sharada) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించున్నారు. వందల సినిమాల్లో నటించిన ఆమె చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలపై శారద స్వయంగా స్పందించారు. ''నేను ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చెన్నై లో ఇంటిలోనే ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మవద్దు'' అంటూ ఆమె ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఆమె కెరీర్ పై ఓ లుక్కేస్తే.. పదేళ్ల వయసులోనే శారదా తెరపై కనిపించి అలరించారు. ఎన్టీఆర్, సావిత్రి నటించిన 'కన్యాశుల్కం' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు శారద. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించిన ఆమె 'ఇద్దరు మిత్రులు', 'ఆత్మబంధువు', 'దాగుడుమూతలు' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మాతృభాషలో హీరోయిన్ గా మారడానికి ఆమె కొంత సమయం తీసుకున్నారు కానీ.. మలయాళ ఇండస్ట్రీలో మాత్రం ఆమె స్టార్ గా ఎదిగారు.
తన అందం, అభినయంతో మలయాళ వాసులను మెప్పించారు. మలయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు. ఆ తరువాత టాలీవుడ్ మేకర్స్ దృష్టి ఆమెపై పడింది. మలయాళంలో ఆమెని 'ఊర్వశి'గా నిలిపిన 'తులాభారం' ఆధారంగా తెలుగులో తెరకెక్కిన 'మనుషులు మారాలి' సినిమాలో కూడా శారద నటించారు. ఈ సినిమాతో ఆమె తెలుగు వారిని ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఉంది తెలుగు సినిమాల్లో ఆమె నటిగా దూసుకుపోయారు.
Also Read: మొన్న ప్రభాస్ - నిన్న అక్షయ్..! ఆ "ట్రైన్ లవ్" ఎంత ట్రెండింగో తెలుసా..?
ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) చిత్రాలలో సైడ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఆమె ఎక్కువగా శోభన్ బాబు సినిమాల్లో ఆయనకు జోడీగా నటించేవారు. వీరిద్దరిది హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సిసింద్రీ చిట్టిబాబు', 'కాలం మారింది', 'మానవుడు-దానవుడు', 'శారద', 'దేవుడు చేసిన పెళ్ళి', 'జీవితం', 'ఇదాలోకం', 'బలిపీఠం', 'కార్తీక దీపం', 'కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త' ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ తో ఆమెకి మంచి బాండింగ్ ఉండేది. 'జీవితచక్రం' అనే సినిమాలో ఎన్టీఆర్ కి సైడ్ హీరోయిన్ గా నటించిన శారద ఏనాడూ ఆయన పక్కన మెయిన్ హీరోయిన్ గా నటించలేకపోయారు. అలాంటి ఆమె తరువాతి రోజుల్లో 'సర్ధార్ పాపారాయుడు', 'జస్టిస్ చౌదరి' చిత్రాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా కనిపించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
Also Read: Digu Digu Naga Song in Trouble: 'వరుడు కావలెను' సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్..