Kasthuri On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్శనల్ లైఫ్ చూసి ఓటేయరు - రోజాకు అదే బలం: సీనియర్ నటి కస్తూరీ కామెంట్స్
సీనియర్ నటి కస్తూరి, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పర్సనల్ లైఫ్ చూసి ఓటు ఎవరూ వేయరని చెప్పారు. కమల్ హాసన్ తనకు టికెట్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు వెల్లడించారు.
ఒకప్పుడు తెలుగుతో పాటు సౌత్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగారు కస్తూరి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్`లోనూ కనిపించి ఆకట్టుకున్నారు. తెలుగు సీరియల్స్‌లో నటిస్తూ.. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై, రాజకీయ నాయకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, కమల్ హాసన్, రోజా గురించి కూడా ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ రైట్ వింగ్ కు సూట్ కాదు - కస్తూరి
పవన్ కల్యాణ్ కు యువతలో బాగా ఫాలోయింగ్ ఉందని కస్తూరి తెలిపారు. సినిమా సెట్స్ లో పని చేసే 30 ఏళ్ల లోపు వాళ్లంతా పవన్ కల్యాణ్ కు వీరాభిమానులుగా ఉన్నారని చెప్పారు. వారంతా జనసేనకు హార్డ్ కోర్ సపోర్టర్స్ గా ఉన్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ విధానం కాస్త విచిత్రంగా ఉంటుందన్నారు. ఆయన రైట్ వింగ్(బీజేపీ)కి సపోర్టు చేస్తున్నారని, ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం రైట్ వింగ్ కు సూట్ కాదని చెప్పారు. అయినా, ఆయన రైట్ వింగ్ ఐడియాలజీకి మద్దతు పలకడం ఆసక్తికరంగా ఉంటుందన్నారు.
పవన్ పర్సనల్ లైఫ్ చూసి ఓటు వేయరు- కస్తూరి
భారత్ లో రాజకీయాల్లో పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అనేది వేర్వేరుగా ఉండదని కస్తూరి తెలిపారు. సినిమా అయినా, రాజకీయాలు అయినా, బిజినెస్ అయినా, స్పోర్ట్స్ అయినా ప్రజలు ముందు వారి వ్యక్తిగత విషయాలనే చూస్తారని చెప్పారు. పబ్లిక్ లైఫ్ ని చూసి ఓటు వేస్తారని భావించడం తప్పన్నారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ చూసి ప్రజలు ఓటు వేయరని చెప్పారు. తన పబ్లిక్ లైఫ్ చూసి ఓటు వేయమని పవన్ కళ్యాణ్ కోరినా ప్రజలు వినరని చెప్పారు. మన దేశంలో ఒక వ్యక్తిని అభిమానించడం మొదలు పెడితే, కుటుంబ సభ్యులుగా చూస్తారన్నారు. అందుకే ముందుగా వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పారు.
కమల్ పార్టీ టికెట్ ఇస్తానని చెప్పారు- కస్తూరి
కమల్ హాసన్ తనకు ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ తరఫున తమిళ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు కస్తూరి చెప్పారు. పార్టీ నుంచి సీటు కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు వివరించారు. కానీ, కొన్నికారణాలతో చేయలేకపోయానని చెప్పారు. కమల్ ఓ ఎన్‌సైక్లోపీడియాగా అభివర్ణించారు. మిగతా రాజకీయ నాయకులతో పోల్చితే ఆయన ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిపారు. రాజకీయాలు అంటే నమ్మకం లేని వారు సైతం ఆయనను చూసి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆయన విధానం తమను బాగా ఆకట్టుకుందన్నారు. కానీ, ప్రస్తుతం ఆయన ఐడియాలజీ మారిపోయిందని చెప్పారు.
రోజా అప్పుడు కూడా ఇలాగే ఉండేది- కస్తూరి
ఇక ఏపీ మంత్రి రోజా పైనా కస్తూరి ఆసక్తికర విషయాలను చెప్పారు. రోజా ఎప్పుడూ బోల్డ్ గా మాట్లాడుతుందన్నారు. ఆమె తనతో పాటు మూడు సినిమాల్లో నటించినట్లు వివరించారు. ఆమె అప్పుడు కూడా ఇప్పటిలాగే మాట్లాడేదని చెప్పారు. రోజాకు ఆమె మాటతీరే బలం అన్నారు.
Read Also: ‘పుష్ప’లో అల్లు అర్జున్ క్యారెక్టర్ చేయాలనుంది - రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్